logo

తెదేపాకు ఏజెంట్లు లేకుండా వైకాపా కుట్ర

రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున ఏజెంట్లు లేకుండా  చేసేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి ఆరోపించారు.

Published : 23 Feb 2024 02:44 IST

మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

బీటెక్‌ రవి సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు

వేంపల్లె, పులివెందుల, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున ఏజెంట్లు లేకుండా  చేసేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి ఆరోపించారు. వేంపల్లెలోని పుల్లయ్యతోటలో గురువారం పార్టీ బీసీ సెల్‌ మండల ఉపాధ్యక్షుడు మరకా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాబుస్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి తెదేపా కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక దళితవాడలో తమ పార్టీకి చెందిన శేషగిరి తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగడం దారుణమని మండిపడ్డారు. పోలీసులు విచారించకుండానే తెదేపా నాయకులనే పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. మరోవైపు తమ అనుచరుల ఇళ్లపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిజాయతీగా వ్యవహరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ‘వైనాట్ పులివెందుల’ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. వైకాపాకు చెందిన ఎద్దుల సురేష్‌, వెంకటేష్‌, హుసేన్‌ పీరా, ప్రసాద్‌లతో పాటు మరో 15 కుటుంబాలు బీటెక్‌ రవి సమక్షంలో తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో నాయకులు రామమునిరెడ్డి, రమేష్‌బాబు, షబ్బీర్‌, దర్బార్‌, వెంకటస్వామి, రమణ, ఎద్దుల శేషారెడ్డి, డీవీ సుబ్బారెడ్డి, జయచంద్రారెడ్డి, మహమ్మద్‌, రామగంగిరెడ్డి, పామలూరు చంటి, ఈశ్వరయ్య, నాగసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పులివెందులలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల నుంచి ఒక్క బీసీ లబ్ధి దారుడికీ రూ.లక్ష రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెదేపా అధికారంలోకొస్తే కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని, వడ్డెరులు, ఇతర కులవృత్తులదారులు ప్రమాదవశాత్తు మృతి చెందితే నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని