logo

బాబోయ్‌ మృత్యుగుంత!

బద్వేలు-కడప మార్గంలోని బీబీ సాహెబ్‌పేట రోడ్డు కూడలిలో ప్రమాదకర గుంత వాహనచోదకులను భయపెడుతోంది. దగ్గరకు వచ్చేవరకు ఇది కనిపించదు.

Published : 23 Feb 2024 02:45 IST

బద్వేలు-కడప మార్గంలోని బీబీ సాహెబ్‌పేట రోడ్డు కూడలిలో ప్రమాదకర గుంత వాహనచోదకులను భయపెడుతోంది. దగ్గరకు వచ్చేవరకు ఇది కనిపించదు. గుంతలో వాహనచక్రాలు పడి అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.. అనేక పర్యాయాలు గుంతను పూడ్చాలని ప్రయాణికులు రోడ్లు భవనాల శాఖ అధికారులకు తెలిపినా స్పందనలేదు. గుంత కారణంగా వాహనాలు పాడవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, బద్వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని