logo

వైకాపా నాయకుల దాడి సంఘటనపై డీఎస్పీ విచారణ

మండలంలోని మణ్యంవారిపల్లెకు చెందిన వైకాపా నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన చాట్ల జయన్న సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Published : 24 Feb 2024 02:38 IST

అట్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని మణ్యంవారిపల్లెకు చెందిన వైకాపా నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన చాట్ల జయన్న సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శుక్రవారం డీఎస్పీ వంశీధర్‌ గౌడ్‌ బాధితుని గ్రామం దిన్నెమీదపల్లెలో అట్రాసిటీ కేసుపై విచారణ చేశారు. రాజన్న తీవ్ర గాయాలై రిమ్స్‌లో చికిత్స పొందుతున్నందున ఇంటి వద్ద బంధువులు, స్థానికులతో మాట్లాడారు. దాడికి గల కారణాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ విచారణలో స్థానిక ఏఎస్సై మోహన్‌బాబు, సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని