logo

మద్దతు ధర చట్టం తేవాల్సిందే

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు.

Published : 24 Feb 2024 02:41 IST

కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నేతలు

అరవిందనగర్‌ (కడప): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. దిల్లీలో రైతులపై కాల్పులు జరిపిన కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా  నాయకులు నాగసుబ్బారెడ్డి, మనోహర్‌ మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలేక గడిచిన పదేళ్ల కాలంలో పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. తక్షణమే ప్రధాని మోదీ స్పందించి రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. నాయకులు బాదుల్లా, కామనూరు శ్రీనివాసరెడ్డి, దస్తగిరిరెడ్డి, అన్వేష్‌, మద్దిలేటి, చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, గంగాసురేష్‌, ఓబులేసు, మనోహర్‌రెడ్డి, యానాదయ్య, అంకుశం, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని