logo

ఖర్చు రూ.కోట్లు... నాణ్యతకు తూట్లు

జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని కాలిబాటల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

Published : 24 Feb 2024 02:43 IST

మాసాపేటలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కూలిపోయిన కాలిబాట

జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని కాలిబాటల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రూ.150 కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో నిర్మించిన కొంత కాలానికే కూలిపోతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని కారణంగా చూపి గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. మదనపల్లె రోడ్డు, చిత్తూరు రింగ్‌రోడ్డు, మాసా పేట తదితర ప్రాంతాల్లోని కాలిబాటలు కూలిపోవడంతో పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సమస్యన ఎన్‌హెచఏఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులకు నోచుకోవడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలిబాటల మరమ్మతుల బాధ్యత గుత్తేదారులపై ఉన్నా వారికి రావాల్సిన బిల్లులు అందకపోవడంతో పనులు చేసే పరిస్థితి లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ ఏఈ రఘునాథబాబు మాట్లాడుతూ కూలిపోయిన కాలిబాటలకు మరమ్మతులు చేపట్టాలని గుత్తేదారులను ఆదేశించామని, త్వరలోనే పనులు చేపడతామన్నారు.

న్యూస్‌టుడే, రాయచోటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని