logo

Proddatur: వైకాపా ఫ్లెక్సీకి పోలీసుల పహారా!

ప్రొద్దుటూరులో తెదేపా ఫ్లెక్సీని తొలగించిన స్థానంలో ఏర్పాటుచేసిన వైకాపా ఫ్లెక్సీకి పోలీసులు పహారా కాశారు. ఫ్లెక్సీల తొలగింపు, ఏర్పాటుపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం తెలిసిందే.

Updated : 25 Feb 2024 09:51 IST

వైకాపా ఫ్లెక్సీకి పహారా కాస్తున్న పోలీసులు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరులో తెదేపా ఫ్లెక్సీని తొలగించిన స్థానంలో ఏర్పాటుచేసిన వైకాపా ఫ్లెక్సీకి పోలీసులు పహారా కాశారు. ఫ్లెక్సీల తొలగింపు, ఏర్పాటుపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం తెలిసిందే. తెదేపా ఫ్లెక్సీని తొలగించిన స్థానంలో వైకాపా ఫ్లెక్సీ ఏర్పాటు కాకుండా చూసే బాధ్యత తమదని పోలీసులు, పురపాలక అధికారులు సర్దిచెప్పగా ఇరు పార్టీల కార్యకర్తలు వెళ్లిపోయారు. ఆ తర్వాత వైకాపా ఫ్లెక్సీ ఏర్పాటుకాగా శనివారం 8వ వార్డులోకి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి వచ్చే వరకు పోలీసులు ఫ్లెక్సీకి కాపలా కాయడం గమనార్హం. ఇదంతా పోలీసులు, పురపాలక అధికారుల డ్రామా అని తెదేపా నాయకులు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని