logo

కొండను తొలిచేస్తూ... మట్టిని తరలిస్తూ!

జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అధికార పార్టీ నేతలు రాత్రి వేళల్లో కొండలను తవ్వి మట్టిని టిప్పర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క టిప్పరుకు రూ.5 వేల చొప్పున స్థిరాస్తి వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు.

Published : 02 Mar 2024 04:16 IST

న్యూస్‌టుడే, సంబేపల్లె: జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అధికార పార్టీ నేతలు రాత్రి వేళల్లో కొండలను తవ్వి మట్టిని టిప్పర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క టిప్పరుకు రూ.5 వేల చొప్పున స్థిరాస్తి వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు. రోజుకు 40 నుంచి 50 టిప్పర్లలో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదని వాపోతున్నారు. సంబేపల్లె సమీపంలోని కొండను జేసీబీలతో తవ్వేసిన ప్రాంతాన్ని చిత్రంలో చూడొచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని