logo

అధికార పార్టీ నేతలకే రీలింగ్‌ షెడ్ల లీజు

అనర్హులైనా అధికార పార్టీ నేతలకే పట్టుపరిశ్రమ రీలింగ్‌ షెడ్ల స్థలాలు లీజుకు కేటాయిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌ ఆరోపించారు.

Published : 02 Mar 2024 04:18 IST

అధికారులను అడ్డుకున్న బహుజన యువసేన

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: అనర్హులైనా అధికార పార్టీ నేతలకే పట్టుపరిశ్రమ రీలింగ్‌ షెడ్ల స్థలాలు లీజుకు కేటాయిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌ ఆరోపించారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారుల రీలింగ్‌ షెడ్లకు ప్రభుత్వ స్థలాలు లీజు అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్లు చేసేందుకు వచ్చిన పట్టుపరిశ్రమశాఖ జిల్లా అధికారి రాజశేఖర్‌రెడ్డి, అధికారులను బహుజన యువసేన నాయకులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. రీలింగ్‌కు అర్హత లేని వారికి కేటాయిస్తున్నారంటూ ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వీరి కంటే ముందు 2010, 2012, 2014లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతవరకు స్థలాలు కేటాయించకుండా అనర్హులైన అధికార పార్టీ నాయకులకు కేటాయించారని ప్రశ్నించారు. గతంలో అర్హులైనవారు రీలింగ్‌ షెడ్లకు దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా పట్టుపరిశ్రమలశాఖ అధికారి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జోనల్‌ పోస్ట్‌కకూన్‌ కమిటీ విచారణ చేపట్టి 11 మంది లబ్ధిదారుల పేర్లను పట్టుపరిశ్రమశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారన్నారు. కమిషనర్‌, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలం లీజుకు కేటాయిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు