logo

నిలువునా తవ్వకాలు... నిత్యం తంటాలు!

సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు.

Published : 02 Mar 2024 04:21 IST

న్యూస్‌టుడే, కమలాపురం: సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. నగర పంచాయతీలోని సొసైటీ కాలనీలో చేపట్టిన తాగునీటి గొట్టాల పనులు సకాలంలో పూర్తిచేయకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. వారం రోజుల కిందట గుంతలు తవ్వి గొట్టాలు అమర్చకుండా వదిలేశారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేకుండా గుంతలు తవ్వేయడంతో పిల్లలు, వృద్ధులు గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయంగా ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోతులను పూడ్చాలని వారంతా కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు