logo

కాంగ్రెస్‌తోనే ముస్లింలకు భద్రత: షర్మిల

కాంగ్రెస్‌ పార్టీతోనే ముస్లింలకు భద్రతతోపాటు అభివృద్ధి జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

Updated : 03 Apr 2024 06:10 IST

కడప ఎంపీ స్థానానికి పోటీ

పులివెందుల, వేంపల్లె, కడప గ్రామీణ, చిన్నచౌక్‌ (కడప), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీతోనే ముస్లింలకు భద్రతతోపాటు అభివృద్ధి జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. కడప నగరంలోని అమీన్‌ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వైకాపా, తెదేపాలు భాజపాతో అంటకాగుతున్నాయన్నారు. దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదని, భాజపా రాజ్యాంగమే నడుస్తోందని వ్యాఖ్యానించారు. అంతకుముందు జమాతే ఉల్‌ హింద్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హబీబ్‌, జిల్లా అధ్యక్షుడు హమీద్‌హుస్సేన్‌, తదితరులను ఆమె కలిశారు. ముందుగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కుమార్తె అంజలి, ఆమె తల్లి విజయమ్మ నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్‌ ఘాట్పై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల కోరిక మేరకు విజయమ్మ ప్రత్యేకంగా 5 నిమిషాల పాటు ప్రార్థనలు చేసి షర్మిలను ఆశీర్వదించారు. అనంతరం వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో పీసీసీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీరాములు, పీసీసీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు దాదా గాంధీ, ఉపాధ్యక్షుడు అలీఖాన్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, ఉపాధ్యక్షుడు నజీర్‌అహ్మద్‌, జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు శ్రీనివాసులరెడ్డి, నాయకులు ధ్రువకుమార్‌రెడ్డి, ఉత్తన్న, బాలసుబ్బరాయుడు, అమర్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని