మాంజా.. మృత్యు పంజా!
న్యూస్‌టుడే, ఆదిలాబాద్ సాంస్కృతికం

డాబాపైకి ఎక్కి పతంగులు ఎగురవేస్తున్న యువకులు
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.. ఈ పండగ వస్తుందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలో హడావుడి అంతా ఇంతా కాదు.. అన్ని వయసులవారు డాబాలు ఎక్కి పోటాపోటీగా గాలి పటాలు ఎగురవేస్తుంటారు. డీజే హోరులో సందడి చేస్తుంటారు. పతంగుల పోటీని ప్రత్యక్ష వ్యాఖ్యానం(కామెంటరీ) చేస్తుంటారు. గాలిలోనే పతంగులను తెంచేయాలని హానికారక రసాయన రంగులతో తయారు చేసిన చైనా దారాన్ని(మాంజా) ఉపయోగిస్తుంటారు. తెగి కింద పడిన ఈ చైనా మాంజాలతో ప్రజల గొంతులకు చుట్టుకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
సంప్రదాయ దారాన్ని వాడాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చైనా మాంజా చుట్టుకొని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న పతంగుల పర్వం విషాదం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో దాడులు
ఈ ఏడాది జనవరిలో నిర్మల్ జిల్లాలో ఇద్దరు చైనా మాంజాతో గాయాల బారిన పడటంతో ఆదిలాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో అనేక గాలిపటాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. రూ.50వేల విలువైన చైనీస్ మాంజాను స్వాధీనం చేసుకొని దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇంద్రవెల్లి మార్కెట్లోని గాలిపటాల దుకాణాలపై అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు.
విక్రయిస్తే శిక్ష తప్పదు..
చైనా మాంజా చాలా ప్రమాదకరం. పక్షులకే కాకుండా ప్రజలకు వీటి వల్ల ముప్పే.. ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మరికొందరు గాజు కోటింగ్‌తో కూడిన నైలాన్, సింథటిక్ దారాన్ని వాడుతుంటారు. ఇదీ ప్రమాదకరమే. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. ప్రజలు గాయపడుతున్నారు.
ఈ జాగ్రత్తలు పాటిద్దాం..
1. చైనా మాంజాపై నిషేధం ఉంది. సంప్రదాయ దారాన్ని వినియోగించడమే మంచిది.
2. విద్యుత్తు తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. చెట్లకు, తీగలకు చిక్కిన పతంగులను తీసేందుకు సాహసం చేయొద్దు. తెగిన గాలిపటాలను అందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
3. క్రీడా మైదానాల్లో గాలిపటాలను ఎగురవేయడం మేలు. ఇంటి డాబా పైన, మేడపైన గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
4. పతంగుల పోటీ ఉత్సాహంలో ఉరుకులు, పరుగులు చేయొద్దు. జన సంచారం ఉన్నచోట ఎగురవేయొద్దు.
ఇద్దరికి గాయాలు

ఈ ఏడాది జనవరి 6న నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో చంద్రవిలాస్, ఎర్రన్న విద్యానగర్ కాలనీ నుంచి బస్టాండ్‌కు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ప్రధాన రహదారిపై చైనా మాంజా అడ్డు వచ్చింది. చంద్రవిలాస్ గొంతుకు మాంజా కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన ఎర్రన్న చేతితో మాంజాను అడ్డుకునే ప్రయత్నం చేయగా చేతి వేళ్లకు గాయమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోలీ వేడుక.. కావొద్దు విషాద వీచిక
[ 03-03-2026]
గతేడాది తాంసికి చెందిన యువకుడు కనక్ ప్రసాద్ హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. మద్యం మత్తులో బైకుపై సుంకిడి వైపు వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
తాగితే ఆరోగ్యం.. ఒలిస్తే ఆదాయం!
[ 03-03-2026]
కొబ్బరి నీళ్లు తాగాక బొండాలను వృథాగా పడేసేవారు.. వాటిలో నీళ్లు నిలిచి ప్రమాదకరమైన డెంగీ, మలేరియా దోమలకు ఆవాసంగా మారేవి.. తాగి పడేసిన కొబ్బరిబొండాలు ఇకపై వృథా కావు.. -
కళ్లలో ‘కలక’లం
[ 03-03-2026]
జిల్లాలో కళ్ల కలక(కంజెక్టివైటీస్) వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్న ఈ వైరస్ కారణంగా పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కత్తితో హల్చల్.. తప్పిన ప్రాణాపాయం
[ 03-03-2026]
పట్టణంలో ఒక వ్యక్తి సోమవారం సాయంత్రం కత్తితో హల్చల్ చేసిన ఘటన కలకలం సృష్టించింది.. స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో తనకు వాటా కావాలంటూ నిందితుడు కత్తితో మరొక భాగస్వామిపై హత్యాయత్నానికి యత్నించాడు. -
పదిలో మెరిసేలా.. శత శాతం సాధించేలా
[ 03-03-2026]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఖానాపూర్ మండలం మస్కాపూర్ ఉన్నత పాఠశాల ముందడుగు వేస్తోంది. ఈ ఏడాది 157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండటంతో వారిని విద్యాపరంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పాఠశాల యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. -
మా కుమారుడిని రప్పించండి
[ 03-03-2026]
మామడ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రమావత్ ప్రశాంత్ 2023లో ఈసీఆర్ పాస్పోర్టుతో కువైట్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ యజమాని వద్ద హౌస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని ఇంట్లో వారికి చెబుతూ వచ్చారు. -
రిమ్స్‌లో సంతాన సాఫల్య కేంద్రం
[ 03-03-2026]
రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్)లో త్వరలో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో గాంధీ, పేట్లబురుజు ఆసుపత్రుల్లో ఐవీఎఫ్(ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలు ఉన్నాయి. -
‘స్త్రీ నిధి’లో చేతివాటం
[ 03-03-2026]
మహిళా స్వయం సహాయక సంఘాలకు చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సహకారం అందించే స్త్రీ నిధిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)తో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. -
క్షణికావేశం.. కుటుంబాలకు తీరని శోకం!
[ 03-03-2026]
జీవితం ఎంతో విలువైనది. సంతోషాలు, కష్టాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు, అనారోగ్యం, కుటుంబ కలహాలు.. -
ఆ 16 నిమిషాల్లో ఏం జరిగింది?
[ 03-03-2026]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు అసలు కారణమేమిటనే దానిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
[ 02-03-2026]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. -
చెరువుల చెర వీడేనా..
[ 02-03-2026]
చెరువులను పరిరక్షించాలి.. శిఖం అన్యాక్రాంతమైనట్లు గుర్తిస్తే అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి.. చెరువు సరిహద్దు భూములను శాస్త్రీయంగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలి’’ అని కలెక్టరేట్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. -
పేరుకే నిబంధనలు.. కొంటే తంటాలు!
[ 02-03-2026]
జిల్లాలో అనధికార లేఅవుట్లతో స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంటు (నాలా)గా మార్పు చేయకుండానే ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. -
ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు?
[ 02-03-2026]
స్థానికంగా సరైన ఉపాధి లేక ఎడారి దేశాలకు వలస వెళ్లి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగించాల్సిన దుస్థితి. ఊరు వదిలి వెళ్లిన వారు ఎన్నేళ్లకు తిరిగొస్తారో తెలియని పరిస్థితి. అంతా సవ్యంగా ఉందనుకున్న తరుణంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యంగా -
సాంకేతిక బాట.. ఉండదిక ‘కట్’కట
[ 02-03-2026]
విద్యుత్తు శాఖ సరఫరా నష్టాలను నివారించడంతో పాటు మరింత మెరుగుపర్చేందుకు ఆధునిక పరికరాలను, సాంకేతికతను ఉపయోగిస్తోంది. సరఫరా లోపం ఎక్కడుందో వెంటనే తెలుసుకునేందుకు వీలుగా జీఐఎస్ విధానం అమలు చేస్తోంది.. -
ఆదాయ ధ్రువపత్రం.. ఆన్లైన్లోనే సిద్ధం..
[ 02-03-2026]
ఆదాయ ధ్రువపత్రం కావాలంటే మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని.. ఆ తర్వాత ఆ దరఖాస్తుకు జత చేసిన ఆధార్, రేషన్‌కార్డు, ఇతర పత్రాలతో రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని బతిమాలే రోజులు దూరం కానున్నాయి. -
అద్దె అడగరు.. పట్టించుకోరు!
[ 02-03-2026]
మంచిర్యాల నగరపాలక సంస్థకు చెందిన దుకాణ సముదాయ (షాపింగ్ కాంప్లెక్స్) భవనాల్లో గదులు తీసుకున్న వ్యాపారులు తక్కువ అద్దె చెల్లిస్తున్నారు. వాటిని సబ్ లీజ్‌లకు ఇచ్చి ఎక్కువ అద్దె పొందుతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
సమయం ఇవ్వాలి.. సన్నిహితంగా మెలగాలి
[ 02-03-2026]
‘మమ్మల్ని ఎప్పుడూ ఫోన్ చూస్తున్నారు అంటున్నారు కానీ కారణం అడిగే వారు లేరు. పేరెంట్స్ వారమంతా పనిచేస్తున్నారు. వాళ్లకు ఒక రోజు సెలవు దొరుకుతుంది. ఆ రోజంతా విశ్రాంతి తీసుకోరు కదా. ఒక గంట మా కోసం కేటాయించాలి. -
ఏరియా ఆసుపత్రి.. సేవలేవి?
[ 02-03-2026]
ఒకప్పుడు ఎంతో మందికి వైద్య సేవలందించిన ఆసుపత్రి నేడు దయనీయ పరిస్థితికి చేరుకుంది. బెల్లంపల్లిలో భూగర్భ బొగ్గు గనులు కొనసాగిన సమయంలో ఏరియా ఆసుపత్రి కళకళలాడేది. వైద్య నిపుణులు ఉండేవారు. -
నిజాయతీ.. ఇస్తుంది తృప్తి..
[ 02-03-2026]
రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే రూ.10 నోటు కనిపిస్తే గబుక్కున తీసుకుంటున్న రోజులివి. పక్క వారి జేబులో ఉన్న సొత్తును కాజేయడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న కాలంలో విలువైన వస్తువులు దొరికినప్పుడు వారి చిరునామా తెలుసుకొని మరీ చేరుస్తున్నారు. -
చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఇద్దరి మృతి
[ 02-03-2026]
ఇంద్రవెల్లి మండలం ధనోరా బి గ్రామం మూలమలుపు సమీపాన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉట్నూరు సీఐ మడావి ప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాలిలా..








