logo

TTD APP: తితిదే యాప్‌ అప్‌డేట్‌.. శ్రీవారి భక్తుల కోసం ‘టీటీ దేవస్థానమ్స్‌’

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 27 Jan 2023 20:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

తిరుమల: శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మొబైల్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసింది. ఇది వరకు ఉన్న ‘గోవింద’ యాప్‌నే టీటీ దేవస్థానమ్స్‌ (TTDevasthanams) పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా ఎస్‌వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాల ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది.  యాప్‌లో తిరుమల చరిత్ర, స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచినట్లు వెల్లడించింది. ఇప్పటికే గోవింద యాప్‌ను తమ మొబైళ్లలో కలిగి ఉన్న వారు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి  ‘టీటీ దేవస్థానమ్స్‌’ను అప్‌డేట్‌ చేసుకోవాలని తితిదే సూచించింది. కొత్త వారు నేరుగా ‘టీటీ దేవస్థానమ్స్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపింది.

మరోవైపు ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు కొద్దిగా సమయం పడుతుందని తితిదే పేర్కొంది. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక పనులు మొదలు పెడతామని వివరించింది. రథసప్తమి సందర్భంగా వాహన సేవలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది. గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు, నీరు, పాలు, ఉచితంగా అందిస్తామని పేర్కొంది.

ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ లింక్‌


Tags :
Published : 27 Jan 2023 12:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు