పీఎస్‌ఎల్‌వీ రిహార్సల్ పూర్తి
నేడు రాకెట్ సన్నద్ధత సమావేశం

స్పెడెక్స్ ఉపగ్రహాలు
సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగిరేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 సిద్ధంగా ఉంది. వాహకనౌక అనుసంధానం పూర్తయిన పిదప, వివిధ పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం రిహార్సల్‌తోపాటు గ్లోబుల్, గ్రౌండ్ తనిఖీలు చేపట్టారు. వాహకనౌకలోని అన్ని దశలు పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాకెట్ సన్నద్ధత(ఎంఆర్‌ఆర్), లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు శనివారం జరగనున్నాయి. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దీంతో ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన పిదప సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 కక్ష్యలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆదివారం షార్‌కు రానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/12/2025)
-

క్యాన్సర్ చికిత్సపై వీడియో.. గ్లోబల్ సైన్స్ పోటీ ఫైనల్స్‌లో భారత విద్యార్థిని
-

రివ్యూ: ఈషా.. తెలుగు హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా?
-

రష్యాను కుడుతున్న.. ఉక్రెయిన్ ‘కందిరీగ’లు!
-

చంద్రుడిపై రష్యా అణువిద్యుత్ కేంద్రం!
-

‘వ్యోమగామి కావాలంటే జ్ఞానదంతాలు వదులుకోవాల్సిందే’ - శుభాంశు


