Alapati Raja: జగన్ సీఎం అయ్యాక పెరిగిన రైతుల ఆత్మహత్యలు: ఆలపాటి రాజా

గుంటూరు: వ్యవసాయంపై సీఎం జగన్ సవతి ప్రేమ చూపిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలపాటి మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో వరితో పాటు వేరుశెనగ, పత్తి, కంది తదితర పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధం చేయలేదు. జగన్ సీఎం అయ్యాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. చనిపోయిన రైతుల కుటుంబాలను కనీసం ఆదుకోలేదు. క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా? పట్టిసీమ నీరు అవసరం లేదని మంత్రి అంబటి అంటున్నారు.. దాన్ని సరిగా ఉపయోగించుకుని ఉంటే సాగునీటి సమస్య వచ్చేది కాదు. నీరు సరిగా రాకపోవడంతో డెల్టాలో భూములు బీటలు వారుతున్నాయి. సాగర్ కుడికాల్వకు నీరివ్వలేమని మంత్రి చెబుతున్నారు. వరినాట్లు వేశాక ఆయన ఈ విషయం చెప్పారు.
అందుకే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావడం లేదు
మార్గదర్శిపై సీఐడీ పెడుతున్న కేసులన్నీ కక్ష పూరితమే. ‘ఈనాడు’లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి రాస్తున్నందునే మార్గదర్శిపై కక్షగట్టారు. ప్రభుత్వ అరాచకాల వల్లే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రావడం లేదు. ప్రభుత్వం దుర్బుద్ధితో మార్గదర్శిని ఇబ్బందుల పాల్జేయాలని చూస్తోంది. సీఐడీ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. రాష్ట్రంలో దుర్మార్గ రాజకీయం తప్ప పాలన లేదు’’ అని ఆలపాటి రాజా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రయాణికుడిపై దాడి కేసు.. ఎయిరిండియా పైలట్ అరెస్ట్
-

తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం
-
నెతన్యాహు వార్‌టైమ్ ప్రైమ్‌మినిస్టర్: ట్రంప్ వ్యాఖ్యలు
-

అతడే.. బౌలర్ ఆఫ్ ది ఇయర్: రవిచంద్రన్ అశ్విన్
-

‘జన నాయగన్’ ఈవెంట్ రికార్డు.. ఎంతమంది హాజరయ్యారంటే!
-

వీసా రూల్స్‌తో భయంభయం.. ఇళ్లకే పరిమితమైన వలసదారులు


