logo

GHMC: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మేయర్‌

Eenadu icon
By Telangana Dist. Team Updated : 30 Jan 2025 11:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ఆమోదంపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రతన్‌ టాటాకు కౌన్సిల్‌ నివాళులు అర్పించింది. సభలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 

సమావేశంలో భారాస కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మేయర్‌ పోడియాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారిని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అడ్డుకొని ప్లకార్డులను చించివేశారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో చర్చ లేకుండానే బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

భిక్షాటన చేస్తూ చేరుకున్న భాజపా కార్పొరేటర్లు 

భిక్షాటన చేస్తూ భాజపా కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్‌ స్టేడియాన్ని కూల్చొద్దని.. అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ వారు నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశం దృష్ట్యా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. (Telangana News)

Tags :
Published : 30 Jan 2025 10:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని