logo

Kavitha: 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ పాతవే భర్తీ చేశారు: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Updated : 08 Oct 2025 13:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని చెప్పారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రాహుల్‌ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు.

‘‘పారదర్శకంగా పరీక్షలు పెట్టండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక పాత ఉద్యోగాలే ఇచ్చారు. ఇవి తప్పుడు పరీక్షలు. కాంగ్రెస్ కోసం వారిని ఎంపిక చేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్ మాట్లాడాలి. మిమ్మల్ని విద్యార్థులు నమ్మారు.. వారి పక్షాన నిలబడండి. మూల్యాంకనం సరిగా జరగాలి. కోర్టుల్లో జడ్జీలకు అర్థం అయ్యేదాకా పోరాటం చేస్తాం. గ్రూప్‌-1 నియామకాలను రద్దు చేసి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు. (Telangana News)

Tags :
Published : 08 Oct 2025 13:39 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని