logo

యూఏఈ గోల్డెన్‌ వీసా ఇప్పిస్తానంటూ రూ.కోటి స్వాహా!

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 23 Jul 2025 08:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) గోల్డెన్‌ వీసా ఇప్పిస్తానంటూ ఒక కంపెనీ డైరెక్టర్‌ మోసగించాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలకు వివిధ రకాల సేవలు అందిస్తుంది. ఆ సంస్థ డైరెక్టర్‌ను గతేడాది రాకేశ్‌కుమార్‌ శర్మ అనే వ్యక్తి కలిసి వరల్డ్‌ వైడ్‌ జూ డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. యూఏఈ బేస్డ్‌ గ్రూప్‌లతో తాము జంతుప్రదర్శన, పర్యాటక రంగాల్లో ప్రాజెక్ట్‌ల్లో భాగస్వామ్యం ఉన్నట్టు నమ్మించాడు. తన పరిచయాలతో యూఏఈ గోల్డెన్‌ వీసా ఇప్పిస్తానంటూ భరోసానిచ్చాడు. విదేశాల్లో వ్యాపార భాగస్వామ్యం కొనసాగించవచ్చని చెప్పటంతో బాధితుడు నిజమని నమ్మాడు. గతేడాది రెండు దఫాలుగా మొత్తం రూ.1,52,38,346 అతడి ఖాతాల్లో జమచేశాడు. ఎంతకీ గోల్డెన్‌వీసా రాకపోవటంతో బాధితుడు నిలదీయటంతో రూ.50లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ.1,02,38,346 ఇవ్వకపోవడంతో నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.

Tags :
Published : 23 Jul 2025 08:42 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని