logo

Ration cards: హైదరాబాద్‌లో రేషన్‌కార్డులు ఆలస్యం

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 22 Jan 2025 07:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కులగణన అర్జీల సర్వే పూర్తయినా ఆగని దరఖాస్తులు
అన్నింటి  లెక్క తేల్చాక వార్డు సభలు, కార్డుల జారీ
ఈనాడు, హైదరాబాద్‌

రాజధానిలో రేషన్‌కార్డుల మంజూరులో జాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లాల్లో మాదిరే.. గణతంత్ర దినోత్సవం రోజున నగరంలో రేషన్‌కార్డులను జారీ చేయాలని మొదట సర్కారు భావించింది. అందులో భాగంగా ఇటీవల కులగణన సర్వేలో కార్డు కోసం అర్జీ పెట్టుకున్న 83వేల మంది అర్హతల పరిశీలనను మంగళవారంతో పూర్తి చేసింది. అయితే ఇటీవల ప్రజాభవన్‌కు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలకు సుమారు లక్షమంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించినట్లు జనవరి 26న రేషన్‌కార్డులను జారీ చేస్తే.. వారంతా అసంతృప్తికి గురవుతారని సర్కారు పునరాలోచనలో పడింది.

కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ.. అందరికీ న్యాయం చేయాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైతం స్పష్టం చేశారు. ప్రజాపాలన సభలు, మీసేవా కేంద్రాలకు అందిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకొని అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అర్హుల పరిశీలన మరో వారం కొనసాగుతుందని, ఫిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు.
90శాతం అర్హులే..: ప్రభుత్వం ఇటీవల సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)ను పూర్తి చేసింది. అందులో భాగంగా 83వేల కుటుంబాలు అర్జీ పెట్టుకున్నాయి. వారి అర్హతలను పరిశీలించగా.. 90శాతం మంది అర్హులని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. 

Tags :
Published : 22 Jan 2025 07:31 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు