Ponguleti: గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో ‘కాళేశ్వరం’ నివేదిక ద్వారా తెలిసింది: మంత్రి పొంగులేటి

ఖమ్మం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా తెలిసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణలక్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు.
ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి కోసం అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తిరుమలాయపాలెం మండలానికి ఒక ఐటీఐ కళాశాల మంజూరు చేశామని, ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునికీకరణ చేస్తున్నామని వెల్లడించారు. మండల అభివృద్ధికి రూ.75 కోట్లు కేటాయించామన్నారు. పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేశామని.. పేద రైతుల కోసం భూభారతి తీసుకొచ్చామన్నారు.

బాలికలకు సైకిళ్ల పంపిణీ..
ఏదులాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, 1, 59, 60వ డివిజన్లకు చెందిన 8వ తరగతి బాలికలకు మంత్రి సైకిళ్లు పంపిణీ చేశారు. పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరుఫున మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా సైకిళ్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                ఆరోగ్య సేవల విస్తరణలో యువ వైద్యుల పాత్ర కీలకం: కలెక్టర్
[ 03-11-2025]
‘‘వైద్య వృత్తి మానవ సేవకు ప్రతీక, విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి’’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. - 
                            
                                
                                పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘనంగా సన్మానం
[ 03-11-2025]
ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన సిబ్బందికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. - 
                            
                                
                                ఉన్నట్టుండి డిప్యుటేషన్‌పై పంపడం తగదు.. నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
[ 03-11-2025]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్‌పై పంపించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు స్థానిక అంబేడ్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. - 
                            
                                
                                ప్రతి విద్యార్థికి ఆధార్.. అపార్ కోసం నమోదు చేయాలి: అదనపు కలెక్టర్
[ 03-11-2025]
ప్రతి పాఠశాలలో గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. - 
                            
                                
                                సీపీఎం నాయకుడి హత్య.. పార్టీ నాయకుల నిరసన
[ 03-11-2025]
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్యను నిరసిస్తూ కూసుమంచిలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. - 
                            
                                
                                శతాధిక వృద్ధుడు సీతారామచంద్ర రాజు కన్నుమూత
[ 03-11-2025]
మన్యంలో ఆధునిక వ్యవసాయాన్ని నేర్పించిన శతాధిక వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. - 
                            
                                
                                నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మేయర్
[ 03-11-2025]
మున్నేరు వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు మేయర్ పునుకొల్లు నీరజ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. - 
                            
                                
                                మద్యానికి బానిసై తల్లిని హతమార్చిన కుమారుడు
[ 03-11-2025]
మద్యానికి బానిసైన కుమారుడు డబ్బుల కోసం తల్లిని హతమార్చిన అమానవీయ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. - 
                            
                                
                                కూతుర్ని కాపురానికి తీసుకెళ్లడం లేదని హత్య
[ 03-11-2025]
తన కూతుర్ని కాపురానికి తీసుకెళ్లడం లేదని అల్లుడు, ఆయన తల్లిపై కత్తితో దాడి చేయగా మహిళ మృతి చెందింది. - 
                            
                                
                                రెన్యువల్‌కు వేళాయె
[ 03-11-2025]
సింగరేణిలో విశ్రాంత ఉద్యోగుల కోసం ఏర్పాటైన కాంట్రిబ్యూటరీ పోస్టు రిటైర్మెంట్ మెడికేర్ స్కీం(సీపీఆర్ఎంఎస్)ను మరో ఏడాది పొడిగించుకొనేందుకు సమయం ఆసన్నమైంది. - 
                            
                                
                                అటు భద్రాద్రి.. ఇటు స్తంభాద్రి
[ 03-11-2025]
పూర్వ ఖమ్మం జిల్లాలో తూర్పున ఉండే చివరి పట్టణం భద్రాచలం. గోదావరి అంచున ఉండే ఈ రామ క్షేత్రానికి వరదలు కొత్తేంకాదు. - 
                            
                                
                                ఆయిల్‌పామ్ రైతులకు శుభవార్త
[ 03-11-2025]
సమీకృత ఉద్యాన మిషన్‌లో భాగంగా ఆయిల్‌పామ్ సాగులో యాంత్రీకరణ పరికరాల కోసం రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. - 
                            
                                
                                యువతా.. మీరే మేలుకోవాలి
[ 03-11-2025]
వారి శాఖ పేరులో ‘శ్రమ’ ఉన్నా తీరులో అదెక్కడా కనిపించదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యువత ఉపాధి కల్పనకు దోహదపడే సదవకాశం చేతుల్లో ఉన్నా, చేతల్లో ఎంతమాత్రం చూపటంలేదు. - 
                            
                                
                                ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 03-11-2025]
జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. - 
                            
                                
                                వడ్లగూడెం గిరి.. ఆధ్యాత్మిక సిరి
[ 03-11-2025]
ఆ కొండపై ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. స్వయంభుగా వెలిసిన దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, అనుబంధంగా పలు కోవెలలతో అలరారుతోంది. - 
                            
                                
                                తప్పిపోయి పదేళ్లు.. తిరిగొచ్చిన ఆనందం
[ 03-11-2025]
మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ పదేళ్ల తర్వాత స్వగృహానికి చేరుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో ఆదివారం చోటు చేసుకుంది. - 
                            
                                
                                మూడు రోజులైనా.. దొరకని జాడ..!
[ 03-11-2025]
చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు హత్య జరిగి మూడు రోజులైనా నిందితుల జాడ పోలీసులకు చిక్కనట్లే తెలుస్తోంది. - 
                            
                                
                                మా అబ్బాయి అలాంటి వాడు కాదండీ!
[ 03-11-2025]
ఇటీవలి కర్నూలు బస్సు దగ్ధమైన ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడానికి ఓ యువకుడి మద్యం మత్తే కారణమని తేలింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 


