logo

Kavitha: నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Updated : 21 Sep 2025 20:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సిద్దిపేట: చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించిన గ్రామం. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కావాలని ముందడుగు వేశారు. అందుకే ఈరోజు మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం మొదలై చరిత్ర సృష్టించింది. చాలా ఏళ్లుగా నేను చింతమడకకు రాలేదు.. ప్రత్యేక పరిస్థితుల్లో కూడా మీ ఆహ్వానం మేరకు వచ్చాను. చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో కులాలు, మతాలకు అతీతంగా పండగలు చేసుకునే వాళ్లం. చింతమడక ఏదైతే నేర్పించిందో అదేవిధంగా అన్ని కులాలను కలుపుకొని పోతున్నా. ఈనేల ఇచ్చిన  ధైర్యంతోనే రాష్ట్రం మొత్తం తిరిగి బతుకమ్మ నిర్వహించా.

2004లో ఉద్యమం మొదలైన తర్వాత కేసీఆర్‌.. మరొకరిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే.. సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా ఆంక్షలు ఉన్నాయి. కొందరు సిద్దిపేట, చింతమడక తమ ప్రైవేట్‌ ప్రాపర్టీలా వ్యవహరిస్తున్నారు. చింతమడక చిరుత పులులను కన్నది. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ ఇక్కడకు వస్తాం. కేసీఆర్‌కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. ఇదే విషయం నేను చెబితే నన్ను బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను. ఈ గడ్డ ఎవరి జాగీరూ కాదు.. ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ వస్తా. కుటుంబానికి దూరం చేశారు అన్న బాధలో ఉన్నా. దుఃఖంలో ఉన్న నన్ను మీరంతా గౌరవించారు.. మీ ఆదరికీ రుణపడి ఉంటా’’ అని కవిత అన్నారు.

Tags :
Published : 21 Sep 2025 19:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు