Uttam Kumar Reddy: అర్హతనుబట్టి ఎంతమందికైనా రేషన్ కార్డులిస్తాం: మంత్రి ఉత్తమ్

హుజూర్నగర్: ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుంది. రేషన్ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదు. దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారు. బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి ఇతర సరకులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాటు చేశాం. కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నాం. కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే బియ్యం ఇస్తాం. రేషన్ బియ్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయి’’ అని ఉత్తమ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా
[ 03-11-2025]
మొంథా తుపానుతో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. - 
                            
                                
                                వాగులో చిక్కుకున్న గొర్రెలకాపరులు.. డ్రోన్ ద్వారా నిత్యావసరాల పంపిణీ
[ 03-11-2025]
దుందుభి వాగు వద్ద చిక్కుకున్న గొర్రెల కాపరులకు అధికారులు నిత్యావసర సరకులను డ్రోన్ ద్వారా అందించారు. - 
                            
                                
                                రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
[ 03-11-2025]
భారీ వర్షాలకు జరిగిన పంట నష్టంపై రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. - 
                            
                                
                                కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
[ 03-11-2025]
కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తూ టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. - 
                            
                                
                                బురదలో ఇరుక్కొని ఒరిగిన పాఠశాల బస్సు
[ 03-11-2025]
ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బురదలో చిక్కుకొని.. ఓ వైపునకు ఒరిగిపోయింది. - 
                            
                                
                                ధ్రువీకరణ లేకపోతే సబ్సిడీ రద్దు
[ 03-11-2025]
గ్యాస్ వినియోగదారులు పారాహుషార్. బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ధ్రువీకరణ లేకపోతే సబ్సిడీ రద్దు కానుంది. ఏటా గ్యాస్ వినియోగదారులు ధ్రువీకరణ చేసుకుంటేనే రాయితీ ఇస్తారు. ఏ సంవత్సరం చేసుకోకపోయినా ఆ ఏడాది నుంచి సబ్సిడీని శాశ్వతంగా కోల్పోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. - 
                            
                                
                                ఉప్పుడు మిల్లులు.. తప్పుడు నిర్వహణ
[ 03-11-2025]
మిర్యాలగూడలో ఐదేళ్ల క్రితం ఓ మిల్లులో ధాన్యాన్ని పెద్ద బాయిలర్‌లో పోసిన తర్వాత ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి పెద్ద శబ్ధంతో పేలింది. ప్రమాద ఘటనలో ఒక కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. - 
                            
                                
                                శునకం వణికిస్తోంది..!
[ 03-11-2025]
రోజురోజుకూ వీధి కుక్కలు పెరుగుతున్నా.. వాటి సంతతి నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడో ఒకచోట వీటి బారినపడి బాధితులు చికిత్స పొందుతూనే ఉన్నారు. - 
                            
                                
                                ఏమైంది.. యువ వికాసం..?
[ 03-11-2025]
యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరవైంది. దరఖాస్తులు సమర్పించి ఆరు నెలలు పూర్తవుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో యువతలో నిరుత్సాహం కనిపిస్తోంది. - 
                            
                                
                                నాణ్యత లేమి.. తనిఖీలు మాని..!
[ 03-11-2025]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆహారశాలలపై తనిఖీలు నామమాత్రం అవుతున్నాయి. మరోవైపు వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరించి రంగులు, టేస్టింగ్ సాల్ట్‌ను కలుపుతున్నారు. శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. - 
                            
                                
                                కలుషిత ముప్పు.. కలగాలి కనువిప్పు
[ 03-11-2025]
ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తుండటంతో చలికాలం వానాకాలన్ని తలపిస్తోంది. పొద్దున ఎండ, సాయంత్రం వర్షం కురవడం.. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. - 
                            
                                
                                రూ.20కి వైద్యం.. సేవే ప్రధానం
[ 03-11-2025]
అనారోగ్యానికి గురై ప్రైవేటుగా వైద్యానికి వెళ్తే ఫీజు రూపంలో వందల్లో తీసుకునే ఇప్పటి రోజుల్లో నామమాత్రపు ఫీజుతో వైద్యం అందిస్తూ నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. సూర్యాపేట జిల్లాలో ప్రజావైద్యుడిగా పేరొందారు డాక్టర్ కొప్పుల రంగారెడ్డి. - 
                            
                                
                                పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులేవీ..!
[ 03-11-2025]
జిల్లాలోని గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు లక్ష్యం కార్యరూపం దాల్చడం లేదు. పంచాయతీల పరిధిలో వీటి నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేశాయి. - 
                            
                                
                                రండి.. ప్రయోగం చేద్దాం
[ 03-11-2025]
విద్యార్థుల్లో సృజనాత్మకతకు పదునుపెట్టి.. భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా ‘వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్’ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. - 
                            
                                
                                రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 03-11-2025]
నకిరేకల్- తానంచర్ల 365వ నంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్ శివారులో ఆదివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఒకరు గాయపడ్డారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 


