Uttam: కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా.. వరి సాగులో రికార్డు సాధించాం: మంత్రి ఉత్తమ్

హనుమకొండ: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumarreddy) తెలిపారు. త్వరలో ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభమవుతాయన్నారు. మంత్రి సీతక్కతో కలిసి హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి చుక్కనీరు లిఫ్ట్ చేయకుండా మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడో పంటలో కూడా భారతదేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 108.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతోంది. దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతోంది. భారత దేశంలో ఇంత ధాన్యం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కొనుగోలు చేయలేదు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటే అది భారత రాష్ట్ర సమితి పాలనలోనే. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం తీసుకోవచ్చని, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని సంతకాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.
మన నీటి హక్కులు కాపాడే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. నీటి వాటాల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో అనేక సార్లు చెప్పాం. కర్ణాటకలో అల్మట్టి డ్యాం ఎత్తు పెంపును కూడా వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో 70 శాతం తెలంగాణకే కేటాయించాలని మేం వాదనలు వినిపిస్తున్నాం. పదేళ్లలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించింది. అది కూడా మూడేళ్లకే కూలింది’’ మంత్రి ఉత్తమ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
[ 03-11-2025]
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం శివారులోని భద్రతండాలో చోటుచేసుకుంది. - 
                            
                                
                                ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి!
[ 03-11-2025]
పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదేళ్ల శరత్ డిమాండ్ చేశారు. - 
                            
                                
                                పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు
[ 03-11-2025]
హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. - 
                            
                                
                                యూరియా కోసం భారీ క్యూలైన్
[ 03-11-2025]
యూరియా కోసం రైతులు ఇంకా అగచాట్లు పడుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో ఉన్నదాన్ని పొందేందుకు బారులు తీరుతున్నారు. - 
                            
                                
                                మహాసభలను విజయవంతం చేయాలి
[ 03-11-2025]
హైదరాబాద్‌లోని సుందరయ్య భవనం ప్రధాన సమావేశ మందిరంలో ఈ నెల 8, 9 తేదీల్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. - 
                            
                                
                                కిడ్నాప్ చేసి.. కిరాతకంగా కొట్టి.. యువకుడి హత్య
[ 03-11-2025]
భూ వివాదంలో భాగంగా ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. - 
                            
                                
                                ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ
[ 03-11-2025]
గ్రానైట్ లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. - 
                            
                                
                                నాలాల విస్తరణే నగరానికి రక్ష
[ 03-11-2025]
వరద నీరు పారే నాలాలు రోజురోజుకు కుచించుకుపోతున్నాయి. ఏటా వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. 2021లో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. నీటిపారుదలశాఖ, గ్రేటర్, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. - 
                            
                                
                                మట్టి గుట్టలు మాయం చేస్తున్నారు!
[ 03-11-2025]
జిల్లాలో మట్టి దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. అనుమతి లేకుండానే.. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల మీదుగా వెళ్తున్న ఎస్సారెస్పీ కాలువ మట్టిని తరలిస్తున్నారు. రాత్రి వేళ ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళుతూ.. - 
                            
                                
                                రుణ అనుగ్రహమెప్పుడో?
[ 03-11-2025]
వరంగల్ కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు డెయిరీ ఫాం ఏర్పాటుచేసి, వ్యాపారాన్ని విస్తరించడానికి 2021లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 80శాతం రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. - 
                            
                                
                                పునరుద్ధరించకపాయె.. పునరావృతమాయె!
[ 03-11-2025]
ఆకేరు వాగు దాటడానికి డోర్నకల్ మండలం ముల్కలపల్లి వద్ద వంతెన నిర్మించారు. ఇది మహబూబాబాద్- ఖమ్మం జిల్లాలను కలుపుతుంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ వారధి 2024, సెప్టెంబరు 2న వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. - 
                            
                                
                                సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు పెంపు
[ 03-11-2025]
జిల్లాలో ప్రస్తుతం రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ)లు ఉన్నాయి. నూతనంగా వంద పడకలతో రెండు ప్రాంతీయ ఆసుపత్రులు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. మంజూరైన ఈ ఆసుపత్రుల నిర్మాణాల ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. - 
                            
                                
                                భవితనిస్తూ.. బాగుపరుస్తూ..!
[ 03-11-2025]
ప్రత్యేక అవసరాలు(సీడబ్ల్యూఎస్ఎన్) గల పిల్లలకు ఆరోగ్యంతో పాటు జీవన ప్రమాణాల మెరుగుకు భవిత కేంద్రాలు ఆసరాగా నిలుస్తున్నాయి. పాఠశాలలకు దూరంగా ఉన్న 3-18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ కేంద్రాలు భరోసా ఇస్తున్నాయి. - 
                            
                                
                                మాకొద్దు బాబోయ్ ఈ పుర పనులు
[ 03-11-2025]
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులకు తుది ఆమోదంతో ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. - 
                            
                                
                                తాగునీటికి ఇబ్బందులే!
[ 03-11-2025]
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించినా నీళ్లు ఎక్కక నిరుపయోగంగా ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో సైతం రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. - 
                            
                                
                                పాతిక పాఠశాలలకే 5 స్టార్!
[ 03-11-2025]
పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అమలు చేస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని రేటింగ్ ఇస్తోంది. జాతీయ స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. - 
                            
                                
                                మహిళా క్రికెట్లో నవశకం
[ 03-11-2025]
మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దీంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగిపోయింది. 1983లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్‌కు అదరణ పెరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 


