Proning: ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోండిలా..!
కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

దిల్లీ: కరోనా వైరస్ రెండో విజృంభణతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో కొవిడ్ రోగులు ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ సోకిన వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే శ్వాస సమస్యలను అధిగమించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా ‘ప్రోనింగ్’ (ప్రత్యేకమైన పొజిషన్లలో పడుకొని ఊపిరి తీసుకోవడం) వల్ల శ్వాసతో పాటు ఆక్సిజన్ స్థాయులను మెరుగుపరచుకోవచ్చని చెబుతోంది.
ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా (ñబోర్లా) పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ‘ప్రోనింగ్’గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్ రోగులకు ‘ప్రోనింగ్’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.
‘ప్రోనింగ్’ ద్వారా శ్వాస తీసుకునే విధానం
* మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.
* ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.
* ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.
* మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి. (పై చిత్రంలో చూపిన విధంగా)
ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు. (కింది చిత్రాల్లో చూడొచ్చు)

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్ చేయవద్దు.
* తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్ చేయండి.
* పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్ చేయవచ్చు.(వైద్యుల సూచనల మేరకు)
* హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.
* ప్రోనింగ్ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.
ప్రయోజనాలు..
* ప్రోనింగ్ పొజిషన్ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.
* ఆక్సిజన్ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్ అవసరం.
* ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించడం ఎంతో ముఖ్యం.
* మంచి వెంటిలేషన్, సకాలంలో ‘ప్రోనింగ్’ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఇక సాధారణ పద్ధతిలో ఆక్సిజన్ స్థాయులను పెంచేందుకు ప్రోనింగ్ సురక్షిత పద్ధతేనని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్ రోగులకు ప్రోనింగ్ ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోనింగ్ గురించి మీ దగ్గరిలో ఉన్న వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. మీ శరీరం అందుకు సహకరిస్తుందా? లేదా? అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఈ విచిత్ర గ్రామాల గురించి తెలుసా?
భారత్‌లో ఎన్నో సుందరమైన గ్రామాలున్నాయి. కొన్ని చారిత్రక ఘట్టాలకు నిలయంగా నిలిస్తే.. మరికొన్ని వింతలు, విశేషాలకు నెలవుగా పేరొందాయి. అలాంటి కొన్ని గ్రామాల గురించి తెలుసుకుందామా! -

ఆలస్యమేమీ కాలేదు.. జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టండి!
కొంతమంది జీవితాలు చాలా అసంతృప్తిగా ఉంటాయి. ఏదో సాధించాలనుకుంటారు.. కానీ, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు వారి జీవితాన్ని ఇంకోలా మార్చేస్తాయి. -

హెచ్-1బీ రాకపోయినా ఇలా ధీమాగా..
అమెరికాలో వృత్తినిపుణులకు కేటాయించే హెచ్-1బీ వీసాల రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై భారత సాఫ్ట్వేర్ నిపుణుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -

కలిసి తింటే.. కలదు సుఖం!
ఒకప్పుడు కుటుంబసభ్యులంతా కలిసి ఉంటూ.. కలిసి తింటూ.. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి ఆలోచించారా? -

విమర్శలు సహజమే.. ఎదుర్కోవడం నేర్చుకోవాలి!
ప్రస్తుత యువత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఏదైనా చిన్న విమర్శ వచ్చినా తట్టుకోలేకపోతోంది. నెట్టింట్లోనే కాదు.. స్కూల్, కాలేజీ, ఆఫీసు ఇలా ఎక్కడైనా తమపై విమర్శలు వస్తే బాధపడుతూ కుంగిపోతున్నారు. -

రిటైర్మెంట్ డెస్టినేషన్.. మీరెక్కడ సెటిలవుతారు?
కాలంతో పాటు అభిరుచులు, ఆలోచనలు, కోరికలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడ ఉద్యోగం చేసినా.. రిటైర్ అయ్యాక సొంతూరిలో ఉండిపోవాలని కోరుకునేవారు. ఇప్పటి యువతీయువకులు అలా కాదు.. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని భాగస్వామితో కలిసి ప్రశాంతమైన ప్రాంతంలో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. -

బాధ పడొద్దు.. చిల్ అవ్వాలంతే.. మరి దానికి ఏం చేయాలి?
నిజమే.. ఆఫీసులో బాస్ కోప్పడ్డారనో.. ఇంట్లో భాగస్వామితో/స్నేహితులతో గొడవ అయిందనో మూడ్ పాడుచేసుకొని బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఎంత చింతిస్తూ కూర్చున్నా ఎలాంటి లాభం ఉండదు కదా! అందుకే, ఆ బాధలో నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి.. -

విహారయాత్రకు వెళ్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..!
వరసగా కొన్ని రోజులు సెలవులు వస్తే చాలు.. బ్యాగ్ సర్దుకొని విహారయాత్రలకు వెళ్లేవారు చాలా మంది. కానీ, అందరిలాగా చూశామా.. వచ్చామా అన్నట్లుగా ఉంటే ఏం లాభం? కాస్త భిన్నంగా ఆలోచించి పర్యటిస్తేనే.. విహారయాత్రను సంపూర్ణంగా ఆస్వాదించొచ్చు. -

SEAL.. ఉ.కొరియాలో ‘అమెరికా ఆపరేషన్’ విఫలమైన వేళ!
అమెరికా రక్షణశాఖలో అత్యంత రహస్య ఆపరేషన్లు చేపట్టే నేవీ సీల్ (SEAL Team Six) బృందం ఉత్తర కొరియాలో ఓ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిసింది. -

వివాహ బంధంలో ఆర్థిక వేధింపులు.. సంకేతాలివీ!
వైవాహిక బంధంలో జీవిత భాగస్వామిని శారీరకంగా వేధించడం ఈ సమాజంలో తరచూ చూస్తూనే ఉంటాం. -

పెళ్లివేదిక ఖాళీగా.. బాజాబజంత్రీలు మోగగా..
ఈ తరం యువత ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్‌తో ఆ సరదాలు తీర్చుకుంటున్నారు. వధువరులు లేకుండా నిర్వహించే ఈ పెళ్లికి సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి సందడి చేస్తున్నారు. -

ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఈ గ్రూప్ యాక్టివిటీస్‌ను ట్రై చేయండి!
చదువు, ఉద్యోగాలరీత్యా చాలా మంది కుటుంబాన్ని వదిలేసి వేరే చోట జీవిస్తుంటారు. దీంతో వారిని ఒంటరితనం వెంటాడుతుంటుంది. మరికొంతమంది కుటుంబంతో ఉన్నా పని ఒత్తిడి, ఆందోళనలతో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. -

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తారా? ఏ దేశంలో ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉందంటే..!
ఉన్న చోట సరైన ఉద్యోగం లభించకపోతే మరో దేశానికైనా వెళ్లాలని భావించే వారు చాలా మంది ఉంటారు. అయితే, ఏ దేశంలో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? ఏ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వంటి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. -

సంతోషకరమైన జీవితానికి 6 ఇటాలియన్ పద్ధతులు..!
ఇటలీ అనగానే మనకు పర్యాటకం, పిజ్జా, ఫ్యాషన్, ఫెర్రారీ, డ్యూకటీ వంటి ఖరీదైన వాహనాలే గుర్తొస్తాయి. కానీ, ఎప్పుడైనా ఇటలీవాసుల జీవనశైలి గురించి ఆలోచించారా? చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకు వాళ్లు 6 ఇటాలియన్ పద్ధతుల్ని పాటిస్తారు. అవేంటంటే.... -

పోర్చుగల్‌లో స్థిరపడతారా? అయితే ఈ గోల్డెన్ వీసా గురించి తెలుసుకోండి!
దుబాయి గోల్డెన్ వీసా, అమెరికా గోల్డ్ కార్డు గురించి అందరికీ తెలుసు. కానీ, పోర్చుగల్ గోల్డెన్ వీసా గురించి తెలుసా? -

‘మద్రాస్ డే’.. నగరం పుట్టిన రోజు!
ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అని మనకు తెలుసు! కానీ, ఇదే రోజున ఓ నగరం కూడా పుట్టిందని మీకు తెలుసా? నగరం పుట్టడమేంటని అనుకుంటున్నారా? ఔను! -

అతడి రీల్స్.. ఓ కుగ్రామంలోని చిన్నారులకు భవిష్యత్తునిచ్చాయి!
కొన్ని మార్పులను ప్రభుత్వాలో, పెద్ద పెద్ద సంస్థలో కాదు.. మనసు పెట్టి ఆలోచించాలే గానీ సాధారణ వ్యక్తులు కూడా తీసుకురావొచ్చని బిహార్‌కు చెందిన ఓ యువకుడు నిరూపించాడు. -

రష్యా అమ్మేసిన భూభాగంలోనే.. ట్రంప్-పుతిన్ భేటీ
అగ్రరాజ్యానికి భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్న అలాస్కాను గతంలో రష్యా నుంచే అమెరికా కొనుగోలు చేసింది. -

చల్లా చల్లని చందమామా.. నిన్ను మండే సూర్యుడిగా మారుస్తాం
జాబిల్లిపై ఏకంగా అణురియాక్టర్ నిర్మించేందుకు అమెరికా, చైనా, రష్యాలు పోటీపడుతుండటంతో మానవుల నుంచి ముప్పు రానుంది. -

రైలు ప్రయాణం చేస్తున్నారా..? మీ హక్కులు తెలుసుకోండి..!
సుదూర ప్రయాణాల కోసం ఎక్కువ మంది రైలుకే ఓటేస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. ఓర్చుకుంటూ ప్రయాణం సాగిస్తుంటారు. కానీ, ప్రయాణ సమయంలో చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు.







