Galwan vally clash: గల్వాన్‌ వద్ద ఆ రోజు ఏం జరిగింది? బయటకొచ్చిన కొత్త వీడియో!

భారత్‌- చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి కొత్త వీడియో......

Updated : 04 Aug 2021 22:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద గతేడాది జూన్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి కొత్త వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆ రోజు అక్కడేం జరిగిందనేందుకు గతంలో కొన్ని వీడియోలు సర్క్యులేట్‌ అయినప్పటికీ మరిన్ని ఆధారాలను చూపించేలా ఈ క్లిప్పింగ్‌ ఉంది.  గల్వాన్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వీడియోను నిపుణుల ఇంటర్వ్యూలో చైనా వైపు మృతిచెందిన సైనికుల కుటుంబ సభ్యులు ప్రదర్శించారు. రాళ్లు రువ్వడం, ఇరు సైన్యాలు పరస్పరం దగ్గరకు వచ్చి ఘర్షణకు పాల్పడటం, నదిలో సైనికులు కొట్టుకుపోయిన దృశ్యాలతో కూడిన 40 సెకెన్ల వీడియో ప్రముఖ ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ డెట్రస్‌ఫాలో విడుదల చేసింది. 

ఈ వీడియో ప్రకారం.. చైనా సైనికుల దూకుడును నిలువరించడంలో మన సైనికులు ఎక్కడా తగ్గకుండా వీరోచితంగా బదులిచ్చినట్టు అర్థమవుతోంది. అప్పట్లో అనేకమంది చైనా సైనికులు నదిలో కొట్టుకుపోయినట్టు వచ్చిన వార్తలను బలపరిచే విధంగా ఈ క్లిప్పింగ్‌లో దృశ్యాలు ఉన్నాయి. గల్వాన్‌ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. చైనా మాత్రం తమ వైపు ప్రాణనష్టం తక్కువేనని చెప్పుకొంటున్నప్పటికీ ఈ దృశ్యాలను చూస్తుంటే మాత్రం అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక చెబుతున్నట్టుగా అటువైపు భారీ సంఖ్యలోనే ప్రాణనష్టం జరిగినట్టే ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని