Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో శీష్ మహల్: ఫొటో షేర్ చేసిన భాజపా

ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ వినిపించిన ‘శీష్ మహల్’ పదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు చండీగఢ్‌లో లగ్జరీ భవనం కేటాయించినట్లు తాజాగా భాజపా ఆరోపణలు చేసింది. ఆ భవనం ఫొటో షేర్ చేసి విమర్శలు చేసింది.
‘‘కామన్ మ్యాన్‌గా ప్రచారం చేసుకున్న వ్యక్తికి సంబంధించి మరో శీష్ మహల్ ఇది. దిల్లీలోని మహల్ నుంచి ఖాళీ చేసిన తర్వాత.. పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతోన్న అరవింద్ కేజ్రీవాల్ కోసం మరో విలాస భవనాన్ని నిర్మించారు. చండీగఢ్ సెక్టార్2లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 7 స్టార్ భవనం కేజ్రీవాల్‌కు కేటాయించారు’’ అని భవనం చిత్రాన్ని భాజపా షేర్ చేసింది. ఈ ఫొటోను ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ నెట్టింట్లో పంచుకున్నారు. ఆమె కొంతకాలంగా సొంతపార్టీపై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. దిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా భాజపా పేర్కొంది. రూ.45 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7- స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్ మోసాలకు ఆ మహల్ ఓ ఉదాహరణ అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ (Sheesh mahal) కట్టుకోలేదని ప్రధాని మోదీ కూడా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి. భాజపాకు విజయాన్ని కట్టబెట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
యూఏఈలోని ఓ ప్రవాస భారతీయుడికి బంపర్ ఆఫర్ తగిలింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లక్కీ డ్రా అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్‌లో ప్రవాసుడైన శరవణన్ వెంకటాచలం రూ.60.38 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నారు. - 
                                    
                                        

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. - 
                                    
                                        

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
Air India survivor: ఎయిరిండియా ప్రమాద ఘటలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. - 
                                    
                                        

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4 నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. - 
                                    
                                        

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
సారనాథ్‌లోని మూలగంధ కుటీ విహారలో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రజాసందర్శనార్థం అందుబాటులో ఉంచారు. - 
                                    
                                        

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
Surat Businessman: తల్లి వర్ధంతి రోజున అన్నదానాలు, వస్త్ర దానాలు నిర్వహిస్తుంటారు. పేదరికంలో ఉండేవారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడమూ చూస్తుంటాం. కానీ సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా కొత్త ఆలోచన చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


