Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతి.. 7 రోజులు సంతాప దినాలు

Eenadu icon
By National News Team Updated : 27 Dec 2024 00:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర అస్వస్థతో దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మన్మోహన్‌సింగ్‌ మృతికి సంతాపం తెలపనుంది. 

1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్‌ సింగ్‌.. దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించిన మన్మోహన్‌సింగ్‌.. సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.  

Tags :
Published : 27 Dec 2024 00:42 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు