Kunal Kamra: పెళ్లి కాకపోయినా.. విడాకులు తీసుకున్నట్లుంది నా పరిస్థితి: కుణాల్ కామ్రా

ఇంటర్నెట్ డెస్క్: స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా (Kunal Kamra) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే((Eknath Shinde)పై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈవిషయంలో కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో కుణాల్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. 37 ఏళ్ల వయసున్న తనకు పెళ్లి కాలేదు కానీ.. కోర్టు కేసులు ఎదుర్కొంటుండడం వల్ల విడాకులు తీసుకున్నంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కేసులను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై కుణాల్ చేసిన వ్యాఖ్యలకు గాను ఇటీవల మహారాష్ట్ర శాసనసభ హక్కుల కమిటీ అతడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడంపై స్పందిస్తూ.. ‘‘షోకాజ్ నోటీసులు ఇవ్వడం వారి హక్కు.. జోకులు వేయడం నా హక్కు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన మాటలు మరోసారి వైరల్‌గా మారాయి.
ఇటీవల ముంబయిలో కుణాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏక్‌నాథ్ శిందేపై ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో కుణాల్ కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతరం ముందస్తు బెయిల్ కోసం కుణాల్ మద్రాస్ హైకోర్టు (Madras Highcourt)ను ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 


