Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు

ఇంటర్నెట్ డెస్క్: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejashwi Yadav)పై పట్నాలోని దిఘా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆయనకు రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయంటూ న్యాయవాది రాజీవ్ రంజన్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది.
శనివారం తేజస్వీ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ తన పేరు సరికొత్త ఓటర్ల జాబితా నుంచి మాయమైందని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఎన్నికల అధికారులు జాబితాలను తెప్పించుకొని వెతికారు. బిహార్ యానిమల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం లైబ్రరీ బిల్డింగ్‌లోని పోలింగ్ బూత్ 204లో దానిని గుర్తించారు. జాబితాలో 416 నెంబర్‌లో తేజస్వీ వివరాలున్నాయని పేర్కొన్నారు. ఆయన ఎపిక్ నెంబర్‌ను RAB0456228గా పేర్కొన్నారు. కానీ, మాత్రం తన ఎపిక్ నెంబర్ RAB2916120గా వెల్లడించారు. అధికారులు మాత్రం ఆ సంఖ్యతో తాము ఆయనకు ఎపిక్ నెంబర్‌జారీ చేయలేదని పేర్కొన్నారు. దానిని తమకు అప్పగిస్తే.. దర్యాప్తు చేస్తామని చెప్పారు.
 ‘ఏ ఫర్ అఖిలేశ్.. డి ఫర్ డింపుల్’ బోధన.. సమాజ్‌వాదీ నేతలపై కేసు  
వాస్తవానికి అంతకు ముందు తేజస్వీ ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ అసలు తన పేరే ఓటర్ జాబితాలో లేదని సంచలన ప్రకటన చేశారు. బిహార్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసిన రోజే ఎన్నికల కమిషన్ భాజపా కోసం ఓట్లను చోరీ చేసిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తేజస్వీ ప్రకటన రావడం గమనార్హం. దీనిపై భాజపా నాయకులు మండిపడ్డారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ రాహుల్, తేజస్వీ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్(SIR)పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


