DK Shivakumar: డీకే సీఎం కావడం ఖాయం.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకే..: యోగేశ్వర్‌

Eenadu icon
By National News Team Published : 08 Jul 2025 16:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) ముఖ్యమంత్రి మార్పు ఉండదని చెప్పినా ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఓ వైపు సిద్ధరామయ్య (Siddaramaiah) చెబుతున్నా.. అక్కడి పరిస్థితులు మాత్రం ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ‘సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా’ అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బహిరంగంగా తన కోర్కెను వెల్లడించడంతో సీఎం మార్పు అంశం తార స్థాయికి వెళ్లింది. తాజాగా డీకేకు అనుకూలంగా ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు.

‘‘ చాలా మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నారు. డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు ఇదే కోరుకుంటున్నారు.’’ అని మంగళవారం యోగేశ్వర్‌ అన్నారు. అయితే, నిర్ణయం మాత్రం అధిష్ఠానం చేతిలో ఉందని చెప్పారు. డీకేకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరో నేత చెప్పుకొచ్చారు. సీఎం మార్పు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వర్గాల మధ్య తీవ్ర అంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా ఇటీవల వారిద్దరితో సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత  సోమవారం డీకే మాట్లాడుతూ..  సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా.. అంటూ తన కోరికను పరోక్షంగా బయటపెట్టారు. ఈ తరుణంలో ఆయనకు మద్దతిస్తూ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని గ్రహించిన అధిష్ఠానం వీరి మధ్య ఓ ఒప్పందాన్ని కుదిరిచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదటి రెండున్నరేళ్లపాటు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాతి రెండున్నరేళ్లు డీకేను ముఖ్యమంత్రి చేయాలని ఆ ఒప్పందం సారాంశం. ఆ గడువు సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం మార్పు తెరపైకి రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని