ED: దగ్గుమందు రాకెట్ కేసు.. కానిస్టేబుల్ ఇల్లు చూసి ఈడీ షాక్

లఖ్‌నవూ: యూరోపియన్ శైలి అలంకరణలు, సుడులు తిరిగిన మెట్లు, వింటేజ్ లైటింగు, ఖరీదైన వస్తువులతో కూడిన ఆ భవనాన్ని చూసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అవాక్కయ్యారు. కొడీన్ కలిపిన దగ్గుమందు రాకెట్లో తొలగింపునకు గురై అరెస్టయిన పోలీస్ కానిస్టేబులు అలోక్ ప్రతాప్‌సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో నిర్మించుకొన్న రాజభవనం లాంటి ఈ ఇంటిపై ఈడీ దాడులు జరిపింది. లఖ్‌నవూ - సుల్తాన్‌పుర్ హైవే పక్కన రెండంతస్తులుగా 7,000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనం ఖరీదు దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. దాడి అనంతరం పలు వస్తువులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పై దగ్గుమందు టోకు వ్యాపార యూనిట్లు నడుపుతున్న నెట్వర్కులో ఆలోక్ ప్రతాప్‌సింగ్ భాగస్వామిగా ఆరోపణలు ఉన్నాయి. 2006లో నాలుగు కిలోల బంగారం దోపిడీ కేసులోనూ ఈయన అరెస్టు కాగా, సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత నిర్దోషిగా విడుదల కావడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. దగ్గుమందు కేసు విచారణకు యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన నిందితుడైన శుభం జయస్వాల్ దుబాయ్‌కి పరారైనట్లుగా అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

గువాహటి తెలుగు కాలనీలో పది రూపాయలకే దోశ
అస్సాంలోని గువాహటి నగరంలో తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే తెలుగు కాలనీ ఫ్లైఓవర్ సమీపాన ఉన్న టిఫిన్ సెంటరులో ఉదయాన్నే దోశ, ఇడ్లీ కోసం జనం రద్దీ మొదలవుతుంది. -

జీ రామ్ జీపై..గరంగరం
‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీనరేగా)ను రద్దుచేసి దాని బదులు ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ- జీ రామ్- జీ)ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. -

మృత్యుపాశమైన పొగమంచు
ఉత్తర్‌ప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు 25 నిండు ప్రాణాలను బలితీసుకుంది. పొగమంచు కారణంగా రహదారులు సరిగా కనిపించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన ఐదు రోడ్డుప్రమాదాల్లో వీరంతా మరణించారు. -

సాయుధ బలగాలకు సెల్యూట్
పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయానికి గుర్తుగా ఏటా నిర్వహించే విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. -

మూడోతరం సైనికుడికి బ్యాండ్ బాజాతో స్వాగతం
పాకిస్థాన్‌పై భారతసైన్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే ‘విజయ్ దివస్’ నాడు (డిసెంబరు 16) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. -

ఏడుగురు కుమార్తెల ఆధ్వర్యంలో మాజీ జవాన్‌కు అంత్యక్రియలు
ఇది ‘అనగనగా ఓ రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు’ కథ కాదు. కుమారుడే లేని మాజీ సైనికుడు కిషన్ కన్యాల్ అంత్యక్రియలను ఏడుగురు కుమార్తెలు ముందుండి పూర్తిచేయగా, గ్రామం మొత్తం కన్నీటిపర్యంతమైన గాథ. -

తొలిసారి పది పరీక్షకు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా మావోయిస్టు ప్రభావిత జముయీ (బిహార్) జిల్లాలోని పలు మారుమూల గ్రామాల నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పదో తరగతి వరకు చదవలేకపోయారు. -

6 వారాల్లో ‘వైకల్య సైనిక శిక్షణార్థుల’ పునరావాస పథకాన్ని ఖరారు చేయండి
సైనిక శిక్షణలో పాల్గొంటూ వైకల్యానికి గురైన శిక్షణార్థుల పునరావాసానికి సంబంధించిన పథకాన్ని 6 వారాల్లో ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. -

క్రీడాశాఖకు పశ్చిమ బెంగాల్ మంత్రి రాజీనామా
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి పర్యటన వేళ కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో చోటుచేసుకున్న గందరగోళం, నిర్వహణ లోపాల ఫలితంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిస్వాస్ క్రీడా మంత్రిత్వశాఖకు రాజీనామా సమర్పించారు. -

తక్కువ ఖర్చు, అధిక పనితీరుతో స్పైడర్ రోబో, సెక్యూరిటీ డ్రోన్లు
హరియాణాలోని ఫరీదాబాద్‌లో గల లింగయా విద్యాపీఠ్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపగల సాంకేతిక ఆవిష్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. -

జీ రాంజీ బిల్లుకు వ్యతిరేకంగా 22న దేశవ్యాప్త ఆందోళన: సీపీఐ
కేంద్ర ప్రభుత్వం ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకా’న్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీ- జీ రాం జీ బిల్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. -

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గితే..
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తే పలు ప్రయోజనాలున్నాయి. -

3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాల విడుదల
మూడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) కసరత్తులో భాగంగా ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఆయా ప్రాంతాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేసింది. -

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలతోపాటు మరో ఐదుగురికి ఊరట లభించింది. -

వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు: నిర్మలాసీతారామన్
వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -

తొలివిడత అనుబంధ పద్దులకు పార్లమెంటు ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.41,455 కోట్ల అదనపు ఖర్చుకు ఉద్దేశించిన తొలివిడత అనుబంధ పద్దులకు పార్లమెంటు ఆమోదం లభించింది. -

ప్రధానికి కారాగారం.. సీడీఎస్‌కు సర్వాధికారం
ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ ‘విభజన ఎజెండా’ను భారత్ తిప్పికొట్టింది. -

‘రిథమ్’ను సరిచేస్తే కణతులకు కళ్లెం!
శరీరంలోని ‘కార్టికోస్టెరాన్ సర్క్యులేటింగ్ రిథమ్’ను క్యాన్సర్ దెబ్బతీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. -

రక్త మార్పిడితో ఆరుగురు పిల్లలకు హెచ్ఐవీ
మధ్యప్రదేశ్‌లో సత్నాలో దారుణం జరిగింది. తలసీమియాతో బాధపడుతున్న ఆరుగురు చిన్నారులకు రక్త మార్పిడి కారణంగా హెచ్ఐవీ సోకింది. -

సంక్షిప్త వార్తలు(9)
దేశ సేవలో ప్రాణ త్యాగాలు చేసిన వీరుల గౌరవార్థం ‘పరమ్ వీర్ దీర్ఘ’ పేరుతో రాష్ట్రపతి భవన్లో చిత్రశాల (గ్యాలరీ)ను ఏర్పాటు చేశారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

సిడ్నీ ఉగ్రదాడి నిందితులతో దౌత్యవేత్తలకు సంబంధాలు.. ఖండించిన విదేశాంగశాఖ
-

సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
-

500 మందికి క్యాన్సర్ చికిత్స.. సోనూసూద్ మంచి మనసు
-

కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్లో భారీ ధర.. యాషెస్‌లో డకౌట్!
-

తెలంగాణ పల్లెపోరు.. లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి
-

ప్రియురాలితో కలిసి పాడ్‌కాస్ట్‌లో కాష్పటేల్.. వెల్లువెత్తుతున్న విమర్శలు


