Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/11/2025)

Eenadu icon
By National News Team Published : 03 Nov 2025 00:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మేషం

మీ మనోబలమే విజయానికి మూలం. ధైర్యంగా ముందడుగు వేస్తే ప్రతి అడ్డంకి మీకు అనుకూలంగా మారుతుంది. నిపుణుల సలహాతో తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను ఇస్తాయి. ఏ పని అయినా విశ్వాసంతో చేస్తే విజయం ఖాయం. శ్రీశివపార్వతులను పూజించడం శాంతి, శక్తిని ఇస్తుంది.

వృషభం

శుభకాలం కొనసాగుతోంది.మీ కృషికి  తగిన గుర్తింపు లభిస్తుంది. కీలక కొనుగోళ్లు లాభాన్ని అందిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన మీలో ధైర్యం, దృఢసంకల్పాన్ని నింపుతుంది.

మిథునం

మిత్రుల సహకారంతో  విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఇష్టదేవతా శ్లోక చదవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

కర్కాటకం

శ్రమతో కూడిన ఫలితం ఉన్నప్పటికీ ప్రతీ కష్టం విజయానికి దారి చూపుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లక్ష్యసాధనలో నిలబడండి. మీ పట్టుదలతో ఏదైనా సాధ్యమే. దుర్గారాధన మీలో మానసిక బలాన్ని నింపుతుంది.

సింహం

వృత్తి, వ్యాపార రంగాల్లో విజయాలు చేకూరుతాయి. గౌరవం, సన్మానం లభిస్తాయి. సమయానుకూలంగా సహకారం లభిస్తుంది. మీరు చూపే నాయకత్వం అందరినీ ఆకర్షిస్తుంది. రవి ధ్యానం మీలో ఆత్మశక్తిని పెంచుతుంది.

కన్య

మనస్సులో ప్రశాంతత, హృదయంలో ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపారులకు శుభయోగం. ఆధ్యాత్మికత మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన వస్తువుల కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గాస్తోత్ర పారాయణ మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది.

తుల

మానసిక దృఢతతో అన్ని పరిస్థితులను జయిస్తారు. శుభవార్తలతో ఉత్సాహం పెరుగుతుంది. బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. స్పష్టతతో తీసుకునే నిర్ణయాలు లాభదాయకం అవుతాయి. శివ అష్టోత్తర పఠనం శాంతిని ప్రసాదిస్తుంది.

వృశ్చికం

మానసిక దృఢత మీ ప్రధానబలం. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనేక శుభసూచనలు కనిపిస్తాయి. బంధుమిత్రుల ప్రేమ, ఆదరణ మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇష్టదైవ దర్శనం మీలో ధైర్యాన్ని, శాంతిని కలిగిస్తుంది.

ధనుస్సు

ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందపూర్వక సమయం గడుస్తుంది. కొత్త అవకాశాలు తలుపుతడుతున్నాయి. శని ధ్యానం మీలో స్థిరబుద్ధి, శక్తిని ఇస్తుంది.

మకరం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అవి తాత్కాలికం. మీరు చూపే పట్టుదల ఆటంకాలను అధిగమిస్తుంది. అలసటను పక్కనబెట్టి సానుకూల దృష్టితో ముందుకు సాగండి. మనశ్శాంతి కోసం చంద్రశేఖర అష్టక చదవడం మేలు చేస్తుంది. 

కుంభం

ధనలాభం కలుగుతుంది. మీ ప్రణాళికలు సఫలమవుతాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీ చురుకుదనం అందరినీ ఆకట్టుకుంటుంది. దుర్గాధ్యానం మీలో ఉత్సాహం, ఆత్మశక్తిని పెంచుతుంది.

మీనం

శ్రమ పెరిగినా ధైర్యంగా నిలబడి విజయం సాధిస్తారు. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త వహించి పొదుపు అలవాటు చేసుకోండి. సమస్యలపై విజయం సాధించగలుగుతారు. శ్రీవేంకటేశ్వరుని పూజించడం ఆపదలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు