Bus Catches Fire: విమానం పక్కనే దగ్ధమైన బస్సు.. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఘటన

Eenadu icon
By National News Team Updated : 28 Oct 2025 15:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. ఎయిర్‌పోర్టులోని (Delhi Airport) మూడో టర్మినల్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్యాక్సీయింగ్‌ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ఘటన (Bus Catches Fire In Delhi Airport) చోటుచేసుకుంది.

అయితే, ఆ సమయంలో బస్సు (Airport Bus)లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు. బస్సు సమీపంలో ఉన్న విమానం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా సురక్షితమేనని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే థర్డ్‌ పార్టీ ప్రొవైడర్‌ ఎయిరిండియాకు ఈ బస్సు సర్వీసులను అందిస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే బస్సుకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎయిరిండియా ఇంకా స్పందించలేదు.


Tags :
Published : 28 Oct 2025 14:05 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు