Earthquake: దిల్లీలో మళ్లీ భూ ప్రకంపనలు.. హరియాణాలో వారంలో రెండోసారి

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని నగరం దిల్లీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. దిల్లీతోపాటు హరియాణాలోని పలు చోట్ల భూమి కంపించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. హరియాణాలోని ఝజ్జర్‌లో 10 కి.మీలో లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రోహ్‌తక్, బహదుర్‌గఢ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
హరియాణాలోని ఝజ్జర్‌లో జులై 10న 4.4 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా వారం వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే, భూకంపం ముప్పు అధికంగా ఉండే జోన్ 4లో దిల్లీ ఉండటంతో ఇక్కడ ప్రకంపనలు తరచూ చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 


