ఏఐని వరంగా మార్చుకుంటే.. 40 లక్షల కొత్త ఉద్యోగాలు
నిర్లక్ష్యం వహిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఉఫ్
మానవ వనరుల నైపుణ్యాభివృద్ధికి ‘ఏఐ ట్యాలెంట్ మిషన్’ ప్రారంభించాలి
నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి

ఈనాడు, దిల్లీ: కృతిమ మేధ (ఏఐ) సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే ఐటీ, బీపీవో రంగాల్లో 2031 నాటికల్లా దేశంలో కనీసంగా 20లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. అలా కాకుండా ఏఐకి అనుగుణంగా మానవ వనరుల నైపుణ్యాలకు పదనుపెట్టుకుంటే 40 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ‘రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ద ఏఐ ఎకానమి’ పేరుతో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కృత్రిమ మేధ ఏ రూపంలో వచ్చినా దాని కారణంగా చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అయితే ఏఐని ఉపయోగించడం తెలుసుకుంటే ఉద్యోగాలు పోగొట్టుకోకుండా కొత్త స్థానాల్లోకి మారేందుకు అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది’ అని నివేదిక పేర్కొంది.
ఏఐ వల్ల అధికంగా ప్రభావితమయ్యే రంగాలు...
- ఐటీ, బీపీవో, ఐటీ సేవల్లో అప్లికేషన్ల డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు
 - బీపీవో రంగంలో.. ఫైనాన్స్, అకౌంటింగ్, కస్టమర్ సర్వీస్, పేరోల్స్, ఇతర విభాగాలు
 - టెక్నికల్ సర్వీసెస్ రంగంలో... 2023 నాటికున్న సుమారు 80 లక్షల ఉద్యోగాలు 2031 నాటికల్లా 60 లక్షలకు తగ్గవచ్చు.
 - కస్టమర్ సేవల రంగంలోని ఉద్యోగాలు 25 లక్షల నుంచి 18 లక్షలకు పడిపోవచ్చు.
 
ముప్పును తప్పించుకోవాలంటే...
- కంప్యూటర్ సైన్స్ విద్యలోని లోపాలను సరిదిద్దుకొని, దేశంలో ఏఐ నిపుణులను పెంచుకుంటే దీర్ఘకాలంలో ఏఐతో విస్తృత అవకాశాలు వస్తాయి. సాంకేతిక రంగంలో హైపర్ స్పెషలైజేషన్ సాధిస్తే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది.
 - ఎంటర్‌ప్రైజ్ ఏఐ స్కిల్స్, ఫ్రాంటియర్ ఏఐ స్కిల్స్, ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం కోసం ‘ఇండియా ఏఐ ట్యాలెంట్ మిషన్’ ఏర్పాటుచేయాలి.
 - మారుతున్న డిమాండ్‌కు తగినట్లుగా వేగంగా మానవ వనరులను సంసిద్ధం చేయాలి. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యావ్యవస్థ కలిసికట్టుగా పనిచేయాలి.
 - పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యావ్యవస్థలో ప్రతి స్థాయిలో ఏఐని అంతర్భాగంగా మార్చాలి.
 - ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ట్యాలెంట్‌ను ఆకర్షించాలి.
 - ఇండియా ఓపెన్‌సోర్స్ ఏఐ కామన్స్ పేరుతో వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


