పొగ రాకముందే.. మంట ముప్పును పసిగట్టేస్తుంది!

అగ్నిప్రమాదాలను ముందే గుర్తించి అప్రమత్తం చేయడంలో కొన్నిసార్లు ఫైర్ అలారంలు విఫలమవుతుంటాయి. అందుకు ప్రధాన కారణం- ప్రమాద సమయాల్లో ముందుగా వాటిలోని వైరింగ్ కాలిపోవడం! ఈ సమస్యకు పరిష్కార మార్గంగా భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎంపీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు సరికొత్త ఫైర్ అలారంను అభివృద్ధి చేశారు. పొగ రాకముందే మంటల ముప్పును గుర్తించి అప్రమత్తం చేయడం దీని ప్రత్యేకత. ఇంకా విశేషమేంటంటే.. ఇది పని చేయడానికి విద్యుత్తుగానీ, బ్యాటరీలుగానీ అవసరం లేదు. ‘షేప్ మెమోరీ అలాయ్’ అనే ప్రత్యేక లోహంతో దీన్ని తయారుచేశారు. చుట్టుపక్కల వేడి నిర్దిష్ట స్థాయిని దాటినప్పుడు ఈ లోహం తన ఆకృతిని తానే మార్చుకుంటుంది. దాంతో అలారం మోగుతుంది. ఈ ఫైర్ అలారంలో వైరింగ్, సెన్సర్లు ఉండవు. విద్యుత్తు అవసరం లేకుండా, కేవలం భౌతికశాస్త్ర నియమాల ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని ఒక్కసారి బిగిస్తే చాలు. మెయింటెనెన్స్ అవసరమేమీ ఉండదు. ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు, కర్మాగారాలు.. ఇలా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఏఎంపీఆర్‌ఐ దీనిపై పేటెంట్ పొందింది. ప్రైవేటు భాగస్వామ్యంతో త్వరలోనే విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.
భోపాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లక్కీ డ్రాలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


