Bengaluru stampede: గవర్నర్‌ను నేనే ఆహ్వానించా: సిద్ధరామయ్య యూటర్న్!

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవం వేళ బెంగళూరు (Bengaluru stampede) చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్‌కు వెళ్లానని ఇటీవల చెప్పిన సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah).. ప్రస్తుతం మాట మార్చారు. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌ను తానే వ్యక్తిగతంగా ఈవెంట్‌కు ఆహ్వానించానని తాజాగా వెల్లడించారు.
తన రాజకీయ కార్యదర్శి గోవిందరాజు గవర్నర్‌కు ఫోన్ చేసి తనకు ఇచ్చారని.. ఆయనతో మాట్లాడి స్వయంగా తానే ఈవెంట్‌కు ఆహ్వానించానని సిద్ధూ తెలిపారు. కానీ, ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదని అన్నారు. కొందరు తన ప్రకటనను తప్పుగా ప్రచారం చేశారని ఆరోపించారు. కాగా.. తొక్కిసలాట ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా, 47మంది గాయపడ్డారు. దీంతో సిద్ధరామయ్య సర్కార్ తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి నా వద్దకు వచ్చి ఆర్సీబీ ఈవెంట్‌కు ఆహ్వానించారు. ఈ వేడుకను మేం నిర్వహించలేదు.. కేఎస్‌సీఏ మాత్రమే ఏర్పాటు చేసింది. గవర్నర్ సైతం వస్తున్నారని నాతో వారు చెప్పారు. నన్ను ఆహ్వానించిన తర్వాతే అక్కడికి వెళ్లాను. వాళ్ల ఆహ్వానం మేరకు వెళ్లడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అసలు స్టేడియం వద్దకు నన్ను ఆహ్వానించలేదు’’ అని ఇటీవల సీఎం అన్నారు. తాజాగా ఆయన మాట మార్చారంటూ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 


