Piyush Goyal: గడువు కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం: పీయూష్ గోయల్

దిల్లీ: గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ తొందరపడదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. రెండు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే అంగీకరిస్తుందన్నారు. భారత్, అమెరికాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉన్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ పటిష్ఠ విధానాలను కలిగి ఉందని స్పష్టం చేశారు.
‘‘ ఇరు పక్షాలకు లబ్ధి చేకూరేలా ఒప్పందం ఉండాలి. అది దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకొనేలా ఒప్పందం ఉంటే.. అభివృద్ధి చెందిన దేశాలతో పరస్పర చర్చలకు భారత్ సిద్ధంగా ఉంటుంది’’ అని గోయల్ స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, ఒమన్, అమెరికా, చిలీ తదితర దేశాలతో వివిధ ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అమెరికాతో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా భారత్ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరుతోంది.
ఇందులో టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్స్, పెట్రో కెమికల్ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు రంగాల్లో సుంకాల సడలింపు కోరుతోంది. అమెరికా పరస్పర సుంకాల సస్పెన్షన్ జులై 9న ముగియనున్నందున, ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 


