Earthquake: భవిష్యత్తులో భూకంపాలను ఇలా తెలుసుకోవచ్చు..

ఈటీవీ భారత్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గత పది రోజల వ్యవధిలో వరుస భూకంపాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భూకంప మూలాలను తెలుసుకోవడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా గత వందల ఏళ్లలో వచ్చిన భారీ భూకంపాలపై ఐఐటీ కాన్పుర్ ఎర్త్‌సైన్స్ విభాగ ప్రొఫెసర్ జావెద్ మాలిక్ ‘ఈటీవీ భారత్’కు కీలక సమాచారాన్ని తెలిపారు. భూకంపాలకు శాస్త్రీయ ఆధారాలు లభించనిచోట గ్రంథాలు, శాసనాల నుంచి చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సమాచారంతో దేశంలోని యాక్టివ్ ఫాల్ట్‌లైన్ ప్రదేశాలను మ్యాపింగు చేస్తున్నట్లు చెప్పారు. పాత భూకంపాల సమాచారం భారత్ వద్ద అందుబాటులో లేదని, నేపాల్ లాంటి దేశంలో మాత్రం ఈ సమాచారంపై డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందుకే శతాబ్దాల క్రితం భారత్‌లో వచ్చిన భూకంపాల గురించి తెలుసుకునేందుకు అక్బర్ నామా, బాబర్ నామా, సంస్కృత గ్రంథాల వంటి వాటిని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమాచారం వాస్తవమా?.. కాదా? అనేది నిర్ధరించుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తామని జావెద్ మాలిక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 


