Best Food: ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో… 12వ స్థానంలో భారత్
నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు
చెన్నై, న్యూస్‌టుడే: ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్‌కు 12వ స్థానం లభించింది. క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రఖ్యాత ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ ‘టేస్ట్ అట్లాస్’ ఈ జాబితాను ఇటీవల తన ఇన్‌స్టా పేజీలో విడుదల చేసింది. గ్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 12వ స్థానంలో, 13వ స్థానంలో అమెరికా ఉన్నాయి. ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలో ఐదో స్థానంలో ముంబయి ఉంది. వడాపావ్, పావ్‌బాజీ వంటి ముంబయి వంటకాలకు అధిక రేటింగ్‌లు వచ్చాయని టేస్ట్ అట్లాస్ చెబుతోంది. దిల్లీ 45వ స్థానం, హైదరాబాద్ 50వ స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీకి అధిక రేటింగ్స్ వచ్చాయి. చెన్నై 75వ స్థానంలో ఉంది. ఇక్కడి దోస, ఇడ్లీ, చెట్టినాడు కూర లాంటి రకాలకు అధిక రేటింగ్స్ లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


