Eknath shinde: ఉగ్రవాదంపై రాజీ లేదు.. పాక్‌ని తుడిచిపెట్టేసే సత్తా మనకు ఉంది: శిందే

ముంబయి: ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని.. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను తుడిచిపెట్టేసే సత్తా మన దేశానికి ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) అన్నారు. ఆదివారం ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడారు. నాలుగు రోజుల పాటు డ్రోన్, క్షిపణి దాడులతో సరిహద్దు ప్రాంతం దద్దరిల్లిన నేపథ్యంలో శనివారం భారత్ -పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజు శిందే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఉగ్రవాదంపై ఎట్టిపరిస్థితుల్లో రాజీ ఉండదని, దీన్ని సహించేది లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు గట్టి సందేశాన్నిచ్చారన్నారు. బాహ్య ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రపంచ పటం నుంచి పాక్‌ను తుడిచిపెట్టే సామర్థ్యం భారత్‌కు ఉందన్న శిందే.. మన దేశ దృఢమైన వైఖరిని చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలన్నారు. తన సొంత పరిమితులేంటో తెలుసుకొని భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలన్నారు.
భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 


