Myanmar Earthquake: భూవిలయం తర్వాత మయన్మార్‌ పరిస్థితి ఇదీ.. ఇస్రో శాటిలైట్‌ చిత్రాలు

Eenadu icon
By National News Team Updated : 01 Apr 2025 08:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మయన్మార్‌లో ఇటీవల నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) ఆ దేశాన్ని కుదిపేశాయి. పెను విషాదాన్ని మిగిల్చాయి. ప్రకంపనల ధాటికి వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమవ్వగా.. శిథిలాల కింద చిక్కుకుని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయానక దృశ్యాలను (ISRO Satellite Images) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాటిలైట్‌ చిత్రాల్లో బంధించింది. (Strong Earthquake in Myanmar)

భూవిలయానికి ముందు, తర్వాత మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలను ఇస్రో (ISRO)కు చెందిన ఎర్త్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ కార్టోశాట్‌-3 ఫొటోలు తీసింది. భూ ఉపరితలానికి 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఈ చిత్రాల్లో భూకంపం కారణంగా ఎంతటి నష్టం వాటిల్లిందో స్పష్టమవుతోంది. ఇరావడీ నదిపై ఉన్న వంతెన కూలిపోవడం, మాండలే యూనివర్సిటీ నేలమట్టమైన దృశ్యాలను ఇస్రో ఫొటోలు తీసింది.

Tags :
Published : 01 Apr 2025 08:06 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు