K Ponmudy: రాజులా.. రాజకీయనాయకులా?: మద్రాస్‌ హైకోర్టు

Eenadu icon
By National News Team Published : 08 Jul 2025 14:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న డీఎంకే నేత, మాజీ మంత్రి పొన్ముడి (K Ponmudy)పై మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. తమిళనాడు పోలీసులు ఆయనపై సరైన రీతిలో చర్యలు తీసుకోకపోతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిగింది.

‘‘ఆర్టికల్ 19ను ఆసరాగా చేసుకొని రాజకీయ నాయకులు ఆకాశమే హద్దుగా నోరుపారేసుకుంటున్నారు. ఈ సమాజంలో ఎన్నో వర్గాలతో మనం కలిసి జీవిస్తున్నాం. దేశం రాజకీయ నేతలది మాత్రమే కాదు. వారు మనుషుల మధ్య జీవిస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు మైక్ తీసుకొని, రాజుల్లా మాట్లాడుతున్నారు. ఇలాంటి అంశాలపై మేం చూస్తూ ఉండలేం’’ అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.

గతంలో చెన్నైలో ఓ కార్యక్రమంలో పొన్ముడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ వర్కర్‌, కస్టమర్‌ మధ్య సంభాషణ ఇలా ఉందంటూ.. అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మంత్రి మాట్లాడిన తీరు మహిళలను కించపర్చేలా ఉందంటూ.. ఆయనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. డీఎంకే ఎంపీ కనిమొళి, గాయని చిన్మయి, నటి ఖుష్బూతోపాటు పలువురు ప్రముఖులు ఆయన తీరును ఖండించారు. మరోవైపు.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆయన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని