Bihar Elections: యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు

Eenadu icon
By National News Desk Updated : 01 Nov 2025 05:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేజీ టు పీజీ నాణ్యమైన ఉచిత విద్య
రాష్ట్రంలో 7 అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం
బిహార్‌ ప్రజలపై ఎన్డీయే హామీల వర్షం

పట్నాలో ఎన్డీయే మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్న నడ్డా, నీతీశ్‌ కుమార్‌. చిత్రంలో కేంద్ర మంత్రులు చిరాగ్‌ పాస్వాన్, జితన్‌రాం మాంఝీ తదితరులు

పట్నా: భారీ వాగ్దానాలతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను  అధికార ఎన్డీయే శుక్రవారం పట్నాలో విడుదల చేసింది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటి¨ ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉచితంగా విద్య, వైద్యం, రేషన్‌ సరకులు అందిస్తామని తెలిపింది. మహిళలు, వలస కార్మికులను ఆకట్టుకునేలా పలు వాగ్దానాలు చేసింది. ప్రతి జిల్లాలో మెగా స్కిల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కేంద్ర మంత్రి- భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌తో పాటు కూటమిలోని భాగస్వామ్య పక్షాల అధినేతలు 69 పేజీల సంకల్ప పత్రం (మ్యానిఫెస్టో)ను విడుదల చేశారు. 

ముఖ్యమైన హామీలు

  • ఈబీసీలలోని వివిధ వృత్తుల నిపుణులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం. 
  • పేదలకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య. 
  • ఉన్నత విద్యను చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.2వేల సాయం.
  • కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడం.
  • స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేసే మహిళలకు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన ద్వారా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం.
  • రాష్ట్రంలో 7 అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాల ఏర్పాటు.
  • 7 ఎక్స్‌ప్రెస్‌ మార్గాల నిర్మాణం. మరో నాలుగు నగరాలకు మెట్రో రైళ్లు.
  • కర్పూరీ ఠాకూర్‌ కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.3వేల సాయం. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి (రూ.6వేలు)కి ఇది అదనం
  • రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్‌ సరకులు. పేదలకు 50 లక్షలకుపైగా పక్కా ఇళ్ల నిర్మాణం. రూ.5 లక్షల దాకా ఉచిత వైద్య చికిత్సల సదుపాయం. 
  • సీతాదేవి జన్మస్థానం ‘పునౌరా ధామ్‌’లో నిర్మిస్తున్న జానకీ మందిర్‌ను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం. సీతాపురంగా నామకరణం చేయడం.
Tags :
Published : 01 Nov 2025 05:05 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు