NEET UG 2025 Exam: ఓఎంఆర్‌ పద్ధతిలో నీట్‌ యూజీ-2025 పరీక్ష

Eenadu icon
By National News Team Updated : 16 Jan 2025 18:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ యూజీ (NEET-UG) పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్‌-పేపర్‌ (OMR based) పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

‘‘నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) నిర్ణయం ప్రకారం.. నీట్‌ యూజీ పరీక్ష పెన్‌, పేపర్‌ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుంది’’ అని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అధికారి వెల్లడించారు.

దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌ యూజీ నిలుస్తోంది. 2024లో 24లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్‌ యూజీని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ - CBT)లో నీట్‌ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్‌ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.

Tags :
Published : 16 Jan 2025 18:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు