Karnataka CM: కన్నడనాట.. అధికార పార్టీలోనే బేరసారాలు- ప్రహ్లాద్ జోషి

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొన్ని రోజులుగా అక్కడ ప్రచారం జరుగుతుండటం, అగ్రనాయకులు వాటిని తోసిపుచ్చుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వాదనను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. సీఎం మార్పు ఊహాగానాల నేపథ్యంలో అధికార పార్టీలోనే బేరసారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
భాజపాలో చేరకుంటే ఈడీ లేదా సీబీఐ దాడులు జరుగుతాయని కాషాయ పార్టీ బెదిరిస్తోందని కాంగ్రెస్‌కు చెందిన హునగుండ ఎమ్మెల్యే విజయానంద్ ఇటీవల ఆరోపించారు. ఇందుకోసం భాజపా 55 మంది జాబితాను రూపొందించిందన్నారు. తాజాగా దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. సదరు ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ఈ జాబితాలోకి రావడానికి ఆయన (ఎమ్మెల్యే) ఏమైనా తప్పుచేశారా? అన్ని ప్రశ్నించారు.
ఎటువంటి తప్పు చేయనివారికి ఆందోళన అవసరం లేదని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. 55 మంది ఎమ్మెల్యేల జాబితా అనేది కూడా సమస్యలను తప్పుదోవ పట్టించేందుకు ఓ కుట్రగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కోసం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వాళ్లిద్దరూ సిద్ధంగా ఉన్నారని, అందుకే అందులోకి వెళ్లే అవకాశం తమకు లేదన్నారు. అయినా అటువంటి విషయాల్లోకి వెళ్లాలని కోరుకోవడం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 


