CM face Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌

Eenadu icon
By National News Team Published : 23 Oct 2025 12:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) తేదీ దగ్గరపడుతోన్న వేళ.. మహాగఠ్‌ బంధన్‌ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరింది. తేజస్వీ యాదవ్‌ వైపే భాగస్వామ్య పార్టీలు మొగ్గుచూపాయి (CM face Tejashwi Yadav). ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. సీఎం అభ్యర్థి గురించి గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. బిహార్ రాజధాని పట్నాలో దీనికి సంబంధించి మీడియా సమావేశం జరిగింది. 

‘‘తేజస్వీయాదవ్ మా కూటమి అభ్యర్థి. మరి మీ అభ్యర్థి ఎవరు..?’’ అని ఎన్డీయేకు మహాగఠ్‌బంధన్ సవాల్ విసిరింది. సీఎం ఫేస్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని విపక్ష కూటమి ప్రకటించడం గమనార్హం. వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ వ్యవస్థాపకుడు ముకేశ్ సహనీ డిప్యూటీ సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఈ ప్రెస్‌మీట్‌ పోస్టర్లలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫొటో కనిపించలేదు. కేవలం తేజస్వి ఫొటో మాత్రమే దర్శనమిచ్చింది. ‘‘ఇది సంయుక్త మీడియా సమావేశమా..? కానీ ఒక్క ఫొటోనే ఉంది. కాంగ్రెస్‌, రాహుల్‌కు వారి స్థానమేంటో చూపించారా..?’’ అని భాజపా వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

కాగా.. కాంగ్రెస్ (Congress) 61 స్థానాల్లో పోటీకి దిగింది. ఆర్జేడీ (RJD) 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. సీపీఐ తొమ్మిది, సీపీఐ (ఎం) నాలుగు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఎనిమిది స్థానాల్లో.. కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఆయా స్థానాల్లో  కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది (Bihar Assembly Elections). ఈ పరిణామంతో కూటమిలో చీలిక వచ్చిందనే వదంతులకు బలం ఏర్పడింది. అయితే, కూటమి పార్టీలు తమలో తాము పోటీపడతాయా, సయోధ్య కుదుర్చుకొని ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని