Tejashwi Yadav: ఫిష్‌ కామెంట్లకు ఆరెంజ్‌తో చెక్‌..: విమర్శలకు దీటుగా తేజస్వీయాదవ్‌ కౌంటర్

తనపై వచ్చిన విమర్శలను ఒక వీడియోతో బదులిచ్చారు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్(Tejashwi Yadav). ఇంతకీ ఏం జరిగిందంటే..? 

Updated : 11 Apr 2024 12:47 IST

పట్నా: ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ప్రయాణిస్తున్న సమయంలో భోజనంగా చేపను తింటున్నప్పుడు చిత్రీకరించిన వీడియోపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటికి కౌంటర్ తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ‘‘మేము హెలికాప్టర్‌లో ఆరెంజ్‌ పార్టీ చేసుకున్నాం. నారింజ రంగుతో వారికి చిరాకురాదులే. అంతేకదా..?’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరో నేత ముకేశ్‌ సాహ్నీతో కలిసి ఆరెంజ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు తమపై విమర్శకులకు ఈ విధంగా బదులిచ్చారు.

చేప తింటూ తీసుకున్న వీడియోపై పలువురు భాజపా నాయకులు, నెటిజన్లు కామెంట్లు పెట్టారు.  తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతనవాది’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలు చేశారు. వీటిపై తేజస్వి స్పందిస్తూ.. అది పాత వీడియో అని తెలిపారు. తన పేరు చెడగొట్టేందుకు ప్రయత్నించేవారి తెలివితక్కువతనాన్ని బహిర్గతం చేయడంలో విజయం సాధించానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని