Tejashwi Yadav: ‘జేడీయూ టికెట్లూ అమిత్ షానే ఇస్తారు’.. తేజస్వీ యాదవ్ విసుర్లు!

పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly elections) సమయం సమీపిస్తున్న వేళ.. అధికార, ప్రతిపక్షాలు ప్రచార వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రచారాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని ఇప్పటివరకు బిహార్‌లో తన ప్రచారాల కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
‘‘కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ బిహార్‌లో దాదాపు 200 బహిరంగ సమావేశాలు నిర్వహించారు. ఒక్కో సమావేశానికి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. అలా బహిరంగ సభల కోసం రూ. 20 వేల కోట్లు వినియోగించారు. ..?’’ అని తేజస్వీ యాదవ్ విమర్శలు చేశారు.
భాజపాకు వరం..
‘‘సీఎం నీతీశ్ కుమార్ పరిస్థితి భాజపాకు వరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ టికెట్లు కూడా కేంద్రమంత్రి అమిత్ షానే కేటాయిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్ (యూనైటెడ్), ఎన్డీఏ, ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నీతీశ్ కుమార్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇకపై రూ.400 పింఛను బదులు రూ.1,100 అమల్లోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


