Kunal kamra Joke row: శిందేను కునాల్ అందుకే టార్గెట్ చేశారు.. క్షమాపణ చెప్పేవరకూ వదలం: సంజయ్ నిరుపమ్

ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ కునాల్ (Kunal Kamra) కమ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) స్పందించారు. కునాల్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చిన వ్యక్తి అన్నారు. అతడు వామపక్ష భావజాలానికి చెందినవాడని.. సంజయ్ రౌత్‌కు సన్నిహితుడని చెప్పారు. రాహుల్ గాంధీతో పాదయాత్రలోనూ నడిచారని.. సంజయ్ రౌత్‌తో కలిసి ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయన్నారు. అంతేకాకుండా శరద్ పవార్, సుప్రియా సూలేను కూడా కలిశారన్నారు. ఇప్పుడు స్టాండప్ కామెడీ పేరుతో తమ నేత ఏక్‌నాథ్ శిందేపై దిగజారి మాట్లాడారని మండిపడ్డారు.
ఈ స్టాండప్ కామెడీ షో రికార్డు చేసిన ప్రదేశం బుకింగ్ డబ్బు మాతోశ్రీ నుంచి, ఉద్ధవ్ ఠాక్రే నుంచి వచ్చిందని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. అందుకే ఏక్‌నాథ్ శిందేను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. తన వ్యాఖ్యల పట్ల కునాల్ క్షమాపణలు చెప్పేవరకు అతడిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కునాల్ ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని తమకు తెలిసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


