Maharashtra: శిందే వర్గం ఎమ్మెల్యేల భద్రత కుదింపు.. మహాయుతిలో లుకలుకలా..?

Eenadu icon
By National News Team Updated : 18 Feb 2025 12:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు గందరగోళంగా మారాయి. ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలోని హోంశాఖ తాజా నిర్ణయంతో మహాయుతి (Mahayuti) కూటమిలోని లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. 20 మంది అధికార ఎమ్మెల్యేల వై కేటగిరీ భద్రతను కుదించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈమేరకు పలు ఆంగ్లమీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. 

ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీ కవర్‌ను ఉపసంహరించుకుంది. భాజపా, అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గం ఎమ్మెల్యేలకు కూడా భద్రతను తగ్గించనున్నారు. అయితే, శిందే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో మహావికాస్‌ అఘాడి కూటమి నుంచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఈ వై కేటగిరీ భద్రతను కల్పించారు. తాజాగా ఈ భద్రతను తొలగించేందుకు సిద్ధమయ్యారు.

3 నెలల కిందటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఎంపికలో విభేదాలు నెలకొన్నప్పటికీ.. వాటన్నింటికీ చెక్‌ పెడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇటీవల ఇన్‌ఛార్జి మంత్రుల నియామకంలోనూ అధికార కూటమిలో విభేదాలు తలెత్తాయి. రాయ్‌గఢ్‌, నాసిక్‌లకు ఇన్‌ఛార్జుల నియామకంపై శిందే సేన అభ్యంతరం తెలపడంతో వాటికి బ్రేక్‌ పడింది. ఈ పరిణామాల వేళ.. శిందే నేతృత్వంలోని ఎమ్మెల్యేలకు భద్రతను కుదించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

Tags :
Published : 18 Feb 2025 12:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు